"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

కవితలు

ఇక్కడ పేర్కొన్న విభిన్న విభాగాల నుండి వ్రాయబడిన కవితలు. యూజర్లు తాము నచ్చిన కవిత లేబిల్ పై క్లిక్ చేసి చదువుకోవచ్చును. లేబిల్ పై క్లిక్క్ చేయగానే ప్రస్తుతమున్న పేజి నుండి రాయబడిన సంబంధిత కవిత గల పేజికి వెళ్ళును. అక్కడ పూర్తి కవిత కనిపిస్తుంది. కవితను చదవడం పూర్తయ్యాక క్రింద ఇవ్వబడిన బాక్స్ నుండి మీ మీ కామెంట్స్ ను పంపించగలరని మనవి. తద్వారా మరింత అందంగా సైట్ ను తీర్చిదిద్దడానికి అవకాశముంటుందన్న చిన్న ఆశ, శుభమస్తు..!

01.శుభాకాంక్షలు

        సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వ్యక్తులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తారు. వారికోసం సాహిత్యంతో కూడిన ‘పుట్టిన రోజు’ కవితను రాయడం జరిగింది. కొత్తగా పలకరించే నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుతాం. అటువంటి సందర్భాలకు వివిధ సంవత్సరాల్లో రాయబడిన ‘కొత్త సంవత్సరం’ అనే కవితలు విశ్లేసిస్తాయి.

        మనిషిలోని విభిన్న పార్శ్వాలకు విభిన్న పేర్లు పెట్టి పిలవడం జరుగుతుంది. మనం పెట్టుకున్న ఆ పేర్లే ఆ వ్యక్తి యొక్క గుణాన్ని తెలియజేస్తాయి. కాని ‘ప్రేమ’ అనే పార్శ్వం మాత్రం ఒక జడపదార్ధం. వివిధమైన వాటికి ఒక్కో పేరు ఉంటె ప్రేమకు మాత్రం వివిధమైన సందర్భాలకు తగ్గ పేర్లు ఉన్నాయి. ‘ప్రేమ’ అనే పదం చెప్పగానే యువతీయువకుల ప్రేమా, తల్లీతండ్రుల ప్రేమా, అన్నా చెల్లెళ్ళ ప్రేమా లేక భార్యాభర్తల ప్రేమా అంటూ ఆలోచించాల్సిన రోజులు ప్రవేశించాయి. ప్రేమ ఒకటే – మమకారం ఒకటే. కాని దానికి ఆపాదించే సందర్భాల్ని బట్టి రూపు మారిపోతుంది. అందుకే ఈ పేజిలోని కవితలు ప్రేమలోని విభిన్న పార్శ్వాలను చూపిస్తాయి.

        ద్వేషానికి మరోపేరు బాధని చెప్పాలో లేక బాధకు మరోపేరు ద్వేషమని చెప్పాలో తెలియదు కాని బాధ, ద్వేషం రెండూ అవినాభావ సంబంధం కలిగిన అంశాలు. బాధ పడుతున్నావంటే జరిగిన విషయంపై ద్వేషం పెంచుకున్నావన్నమాటే. ద్వేషిస్తున్నావంటే లోలోనే బాధపడుతున్నావన్నమాటే. అది వ్యక్తి మీద కావొచ్చు, వ్యవస్థ మీద కావొచ్చు, దేహం మీద కావొచ్చు, దేశం మీద కావొచ్చు, ఏ విషయం మీదనైనా కావొచ్చు. అందుకనే ఈ పేజిలో అలా బాధపడిన సంఘటనల గురించి, బాధపెట్టిన పరిస్థితుల గురించి, ద్వేషాన్ని రగిల్చిన అనుభవాల గురించి వ్యక్తపరచ బడ్డాయి.

        స్ఫూర్తి పొందాలంటే ఏదో జరగాలని కాదు. నీ చుట్టు ప్రక్క్కల జరిగే నువ్వు గమనించని చిన్న చిన్న అంశాలే నీలో స్పూర్తిని రగిలించవచ్చును. మొదటిసారి చూసినప్పుడో, ఆలోచించినప్పుడో అది చిన్నదే కావొచ్చు. కాని అప్పుడప్పుడు నిన్ను వెంటాడుతోందంటే దాన్నుంచి నీవు ఏదో నేర్చుకోవాలనే. మరోసారి తరచి చూస్తె మార్గదర్శనం కనిపించవచ్చు. అదే నీకు ఆదర్శం కావచ్చు. తల్లీదంద్రులే ఇందుకు తార్కాణం. వాళ్ళ గురించి ఒక్కసారి మనస్పూర్తిగా ఆలోచిస్తే అప్పుడర్ధమవుతుంది వాళ్ళే మనకాదర్శం అని. ఆ సందర్భమే రాకపోతే పరిస్థితులే మనల్ని నడిపిస్తాయి. విభిన్న సందర్భాలలో రాసిన కవితలు మనకో మార్గదర్శనం చేస్తాయని ఆశిస్తున్నాం.

        ఏంటో ఈ జీవితం పైకెగిరిన ప్రతిసారి కొత్తగా ఉంటుంది. కొత్త అనుభూతులను పంచుతుంది. అటువంటి స్వచ్చమైన అనుభూతులే వర్షం పుడమిని తాకిన ప్రతిసారి సంభవిస్తాయి. చినుకులు బుగ్గలను తాకితే ఒక అనుభూతి, శిరోజాలను ముద్దాడితే మరో అనుభవం. వర్షంలో తడిసిన, తడిమిన ప్రతిక్షణమూ తన్మయత్వం చెందుతున్న అపురూప క్షణమే. వర్షం బాధను తగ్గిస్తుంది. సంతోషాన్ని పెంచుతుంది. కన్నీటిని తనలో కలిపేసుకుంటుంది. మాటలకందని అనుభూతులకందే విషయాలన్నీ వర్షంలో దాగున్నాయి.

        నేనంటే నేను కాదు. నేనంటే మరొకరి ప్రవర్తన వలన సృష్టించబడే ఓ రూపాన్ని అని ప్రతి మనిషీ చెప్పుకుంటాడు. సృష్టిలా మారడానికి మనిషి ఆలోచనలే కారణం. ఇలా చేస్తే బావుణ్ణు, అలా చేస్తే విజయం సాధించొచ్చు అంటూ అలా ఇలా అనుకోవడం మనిషికి పరిపాటే. నా చుట్టూ ప్రపంచం ఎలా ఉందో నేనాలోచించే ప్రపంచం కూడా అలానే ఉంటుందని తనని తానె మెచ్చుకుంటూ ఉంటాడు.

        ప్రపంచంలో సమాజాన్ని ఎంత చూసినా, ఎంత చదివినా అది చాలా తక్కువే. ఎన్ని సందర్భాలను పలకరించినా పలకరించనవి మనకు అంతుబట్టని జడపదార్ధాలే. ఒకవేళ మనమే సందర్భాలను సృష్టించినా తడననుగుణంగా సృష్టించబడే పరిణామాలు మనకు తెలియకుండానే అనుసరిస్తాయి. అందుకే మనల్ని అనుసరించే మనకు తెలిసే సందర్భాలను ఒడిసి పట్టుకోవాలి. ఒక్కో సందర్భము ఒక్కో గొప్ప విషయాన్ని అందించే పుష్పక విమానమే.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!