"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

హోమ్


       భాష ఏదైనా భావం ఒక్కటేనన్నట్లు ఏ భాషలోనైనా సాహిత్య హితం ఒకటే. అదే సర్వహిత సమ్మేళనం. ఎవరో వచ్చి ఏదీ చేయరు. మనకు మనమే తెలుసుకోవాలి. మనకి మనమే నేర్చుకోవాలి. నిన్ను నివ్వు సంస్కరించుకున్నప్పుడే సమాజం బాగుపడుతుందని చెప్పడమే కవిత్వాల ఉద్దేశ్యం. "భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది."        కొన్ని కవిత్వాలు హితం కోరతాయి. కొన్ని కవిత్వాలు హెచ్చరిస్తాయి. దారి చూపిస్తాయి. ధైర్యం నింపుతాయి. మంచిని ఎలుగెత్తి చాటుతాయి. చెడుని చీల్చి చెండాడుతాయి. సమాజంలో నువ్వూ ఓ భాగమేనని గుర్తు చేస్తాయి. స్థూలంగా నీలోనున్న కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలను నీ ఆధీనంలోకి తెచ్చుకున్నప్పుడే సంస్కరింపబడినట్లని మన పూర్వీకుల మాటలను గుర్తు చేస్తూ మేల్కొల్పడమే కవిత్వాల ఉద్దేశ్యం. 

        యూజర్ల సౌకర్యార్ధం కవితలను ‘శుభాకాంక్షలు’, ‘ప్రేమ’, ‘బాధ’, ‘స్ఫూర్తి’, ‘వర్షం’, ‘నేను’, ‘సాధారణం’ అను 7 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒక్కో విభాగపు పేరే అది తెలియజేసే సందర్భాన్ని స్పష్టంగా వివరిస్తుంది. ‘శుభాకాంక్షలు’ అను పేజిలో ఎవరికన్నా శుభాకాంక్షలు తెలియజేయడానికి కావాల్సిన కవితలు పొందుపరచబడ్డాయి. ప్రేమలోని భావాలను, అనుభవాలను అక్షరీకరిస్తే ఎలా ఉంటుందో ‘ప్రేమ’ పేజిలోని కవితలు తెలియజేస్తాయి. భూమికి మూడు వైపులా నీరు ఒకవైపే భూభాగం ఉన్నట్లు మనిషి జీవితంలో సుఖాల కన్నా బాధలే ఎక్కువుగా ఉంటాయి. వాటిలో కొన్ని సందర్భాలను ‘బాధ’ అను పేజిలో లిఖించబడ్డాయి.


        ప్రపంచంలో మనిషి కనిపించే ప్రతి గొప్ప వ్యక్తి క్రిందనుండి పైకి ఎదిగిన వారే. వారి జీవిత చరిత్రలే మనకు మార్గ దర్శకాలు. విజయానికవి సోపానాలు. దానికి సంబందించిన స్పూర్తిదాయక కవితలు ‘స్ఫూర్తి’ పేజిలో ఉన్నాయి. మనకు కనిపించే ప్రతీది ఎంతో గొప్పదైనది. ప్రకృతే పుడమికి పురుడు పోస్తుంది. ప్రకృతంత ఆహ్లాదకరంగా మారడానికి వర్షాలే కారణమనడంలో అతిశయోక్తి లేదు. వర్షానికి సంబందించిన కవితలు ‘వర్షం’ పేజిలో రాయబడ్డాయి. ‘నేను’ అను పేజిలో రచయిత అనుభవాలు, జ్ఞాపకాలే కాదు మరో వ్యక్తి సమస్యలోకి పరకాయ ప్రవేశం చేసి అనుభవిస్తూ రాసిన కవితలూ ఉన్నాయి. చివరిదైన ‘సాధారణం’ పేజిలో ముందు చెప్పుకున్న సందర్భాలు కాకుండా మిగిలినవన్నీ ఇవ్వబడ్డాయి.

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి... 

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!