"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Friday, 2 February 2018

ఉగాది

మనలాగే
అప్పుడప్పుడు మారుతున్న ఋతువులు,
తమ ఉనికిని తెలియజేయడానికి -
వివిధ వాతావరణ పరిస్థితులను సృస్టిస్తాయి.


బంధాలు దూరమైతే
పాశ్చాత్య ప్రభావం పడుతుంది.!
సంప్రదాయాలు కనుమరుగైతే
దేశం వినాశనమవుతుంది.!!

విత్తుని బట్టే చెట్టు,
చెట్టును బట్టే గాలి,
వాతావరణాన్ని బట్టే ఆచారాలు,
ఆచారాలే మన అస్థిస్త్వాలు.

అవే వెంటాడుతున్న సంతోషాలను
మనకోసం దగ్గరకు తెస్తున్నట్లు
పండుగల రూపంలో దాగుంటాయి.

ప్రతి ఫలాలను మనకందిస్తాయి.
అన్ని రకాల రుచులను అందుకొని,
సార్వభౌమత్వాన్ని కాపాడాలని 
కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు..!!
23rd March, 2012.

1 comments:

  1. మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు...!!

    ReplyDelete

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!