"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Saturday, 27 January 2018

ఉన్మాది

హాయిని కలిగించేలా,
అనుమానం పడకుండా ఉండేలా,
ఎన్నెన్నో మార్పులతో,
చోధ్యాలను సృష్టిస్తుందీ సమాజం.!

కులమత బేధాలతో మొదలౌతుంది.
భాషలతో అర్ధం కాకుండా చేస్తుంది.
ఆర్ధిక వ్యత్యాసాలను చూపిస్తుంది.
మన లౌకిక తత్వాన్ని విడగోడుతుంది.
కొంతమందికే సౌకర్యాలన్నింటిని కల్పిస్తుంది.
ఎంతో మందికి ఆకలి దప్పికలను రుచి చూపిస్తుంది.

భార్యా భర్తల మధ్య మనస్పర్థలు,
బంధువుల మధ్య కలహాలు,
తల్లిదండ్రుల మధ్య గొడవలు,
పసి హృదయాలపై ప్రసరిస్తున్నాయి దృక్కోణంలో.!
చిన్నా పెద్ద తేడాలేకుండా
కనిపించని మంటని రగిల్చి ఊరుకుంటుంది.
గొడవలతో సతమతమవుతూ  
చిన్నారుల రూపకల్పన విఫలమవుతుంది.!
దిశా నిర్దేశనం కరువైనప్పుడే ఉన్మాది పుడతాడు.
 
ఎద లోతుల్లోని ఆవేశాలు
అప్పుడప్పుడు పైకి లేస్తాయి.
అతని చేష్టల వెనుక బలమైన 
ఆచార వ్యవహారాల ప్రభావం ఉంటుంది.
సంప్రదాయాల కట్టుబాట్ల వ్యవహారాలుంటాయి.
ప్రేమ చూపిన వారిపై కరణా ఉంటుంది.

ఎప్పుడెప్పుడిదో  రావణ కాష్టం. 
ఇప్పుడిది ఉన్మాద హోమం .! 
ఎవరికీ మ్రొక్కి వరాలు పొందుతున్నారో -
ఎవరో ఒకర్ని బలి తీసుకుంటూనే ఉన్నారు.
                       15th March, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!