కదిలే కాలంలో కొంత కరిగినా -
అనుకున్న ఆశలు ఆవిరి అయినా
-
తరుణీ పునర్వవ్యవస్తీకరణ
కొంత జరుగకపోయినా -
చేయవలసిన కార్యం వాయిదా
పడినా -
కలల కౌగిలి గాడత
పెరుగుతున్నా -
విహారంలో ఊహజనితముగా
ఉంటున్నాను.
గమ్యముకై కాల గమనంలా
పరిగెడుతున్నాను.
కొంతసేపు ఆగి
ఎదురుచూస్తున్నాను.
ఆగడమే తెలియని దానిని
స్వాగతిస్తున్నాను.
వికసించే ఆశలు కోయిల గానంలా
విచ్చుకోవాలని -
మయూర పురిలా అవకాశాల
ఆహ్వానం పరచాలని -
ఆశిస్తూ కొత్త సంవత్సర
శుభాకాంక్షలు..!!
01st January, 2010.
01st January, 2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు