"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Thursday, 7 July 2016

తమ్ముడు

నీ రూపం మరుపురానిది
నీ మోము వర్చస్సు కూడినది
నీ అల్లరి చేష్టలే మధురానుభూతులు
నీ ప్రవర్తనకే అభినందనలు 
నీ గుణమే నీకు వనమాలి
నీ హాస్యమే నీకు ఆభరణం 
సౌరభాన్ని చూడలేనంతగా
నీ వక్తిత్వాన్ని వ్యక్తీకరించలేం  
వెన్నలకు  రూపాన్నివ్వగలేనంతగా
నీ గుణాన్ని వక్రీకరించలేం 
సూర్యుని కాంతి మారుతూంటుంది
నీ మంచి ప్రవర్తన ఎల్లప్పుడూ ఒకటే!
వెన్నెల కాంతి హాయినిస్తుంది
నీ మాటలు ఆనందానుభుతినిస్తాయి. 
శబ్ద వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ
నీ జ్ఞాపకాలే ఇప్పుడేక్కువయ్యాయి  
చిరునవ్వులను చిందించి
మనోఫలకంపై చిరునవ్వు గీత గీశావ్
పాన్పు పైన రోజులను గడిపి
దూరమైన స్వర్గపు అంచులకోసం మెట్లేక్కావ్
జ్ఞాపకాలను మాకు మిగిల్చి
పంచభూతాలలో మిళితమైపోయావ్  

అప్పుడే తెలిసింది
జ్ఞాపకాలు అంటే ఏంటో అని
ఎంతదూరమో నీ ప్రేమని..!

07th September, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!