"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 15 June 2016

ఓ స్వప్నం

ఒక స్వప్న లోకాన్ని
మధురమైన స్వప్నం చెదరగోట్టింది.
స్వప్నమైన తను మనస్సును ఆకర్షిస్తుంటే,
సర్వెంద్రియాలలో ప్రధానమైన నయనాలతో కవ్విస్తుంటే
కొత్త బంగారులోకంలో విహరించినట్లు అనిపిస్తుంది మనస్సు.

సర్వెంద్రియాలు తన్మయత్వం చెందుతున్న వేళ,
వడివడిగా పడుతున్న చినుకులు ఉలిక్కిపడేలా చేసి,
కనుమరుగవుతున్నప్పుడు చూశాను ఎక్కడో . . .
వేల వేల నక్షత్రాల నడుమ
ఓ ద్రువతారాల మెరుస్తున్న నా చెలి !
అల్లంత దూరాన ఆ తారక అలా -
వెళ్లిపోతుంటే నా కన్నులు ఆగవేలా !
వెతికి వెతికి సోలసినప్పుడు కనిపించింది
మరలా కలలోనే !!

ఓ ప్రియతమా --
కలలు కనడం నిన్ను చుసిన తర్వాతనే నేర్చుకున్నాను.
ఆ కలలో నీ రూపం చూసుకొని మురిసిపోయాను.
నీ దరిచేరితే ప్రపంచాన్ని జయించినంతగా ఆనందిస్తాను.
నిను విడనాడితే సముద్రంలో ఎదురీతేనని భావిస్తాను.
నిను చూసినప్పుడల్లా నీతో గడపాలని అనుకుంటాను.
నీతో మాట్లాడితే చాలు నను నేను మైమరచిపోతాను.
నిను చూస్తూ ప్రకృతిలా కాలాన్ని ఆస్వాదిస్తాను.
అందుకే నువ్వు నా సొంతం అనుకుంటాను.
మరువకు సుమా !
నను మరువకు !!!                                  

24th November, 2007. 

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!