"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Sunday, 1 May 2016

చెలియా.!

చెలి చరణాలు ధరణిని తాకిన సమయాన...
మొలకెత్తిన పచ్చిక బయళ్ళు
గాలులతో ఊగిన క్షణాన...
ఆ పిల్లగాలి ప్రవాహం
నలుదిక్కులకూ వ్వాపించిన సమయంలో...
ఏ దిక్కూలేని నా మనసుకు..
ఆ దిక్కులోనే నీవు ఎదురైతే..
వెలుగును తట్టుకోలేని నా కనులు
కాస్త వంగిపైకి చూస్తె ..
నా మనసుకు కూడా
పువ్వు పరిమళాన్ని శోధించాల్సిన పని లేనట్లుగానే..
తెనేటేగకు తేనే కోసం
పరితపించాల్సిన తపన లేనట్లుగానే..
చంద్రుడు వెన్నెల కోసం
వెతకాల్సిన కార్యం లేనట్లుగానే..
మమతానురాగాల కోసం
అన్వేషించాల్సిన అవసరం లేకపోయింది.!

కడవరకు కురిపించాల్సిన ప్రేమ
కనులతోనే చూపిస్తుంటే 
బాటసారిలా సాగాలసిన నా జీవనం స్వర్గామయమవుతుంది.
క్షణకాలంలో చూసిననయన ప్రేమతోనే
ఉషస్సు జననాలను చూస్తున్నా,
ఇప్పుడిక తపనే ఎరుగని
ఈ తనువుకు లక్ష్యం నిర్దేశిస్తావా ?
తలంపునే తలదన్నేలా
తలరాతను మార్చుకొని 
సంద్యవేళ కాసేపు ఉండే ఉషస్సులా కాక - 
నీడలా తోడుండి నడిపిస్తాను చెలియా !                     

30th November, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!