"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Sunday, 1 May 2016

అనుభూతి

ఏంటో తెలియని అనుభూతి
నిను చుస్తే కలుగుతుంది.
కలిగిన ఆ అనుభూతి గిలిగింతలతో కవ్విస్తుంది,
అది తలుచుకుంటే
తనువు తన్మయత్వం చెందుతుంది.
ఆ తన్మయత్వమే సరియైన మార్గం కోసం చూస్తుంది.

ఎటు చూసినా ఎదురుపడే ఆ తామసిని
దాటుకొని పయనించే మార్గం ఎక్కడ !
ఒకటైన మన గమ్యాన్ని చూచి సమర్ధించే 
వీక్షకులే మనకు మార్గంలా మారాలి.

మల్లెపూల పరిమళాన్ని ఎలా తెలుసుకోగాలమో 
మన మనసుల స్వచ్ఛతను ఎదుటివారు తెలుసుకోవాలి.
ప్రేమంటే రూపం లేనిదిలే కాబట్టి
ప్రేమకు నిదర్శనముగా మనము ఉండాలి.
సౌరభాన్ని ఎలా చూడాలేమో
మన లోపాలను చుడనీయకుండా ఉందాం.
మరి ఇంతటి నమ్మకాన్ని నడిబజార్లో పెట్టకుండా 
నడవడికనే పూలబాటలా మార్చుకుందాము !!                      

24th November, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!