"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Saturday, 2 April 2016

బాధితులం

నేను ప్రపంచంలో ఉంటాను 
కాని ప్రపంచంతో పని లేదు !
నేను సమాజంలో బ్రతుకుతాను 
కాని సమాజంతో సంబంధం లేదు !
నేను జనంతో పాటే ఉంటాను 
కాని ఎవ్వరి అడుగుజాడల్లో నడవను !
నేను చుట్టూరా తిరుగుతాను 
కాని అది నా ప్రపంచం కాదు !

నేనం అనాధను కాదు 
అందరూ ఉన్న అభాగ్యుడిని 
తోడేవ్వరూ లేని బికారిని 
నీడలేని నిరాశ్రయుడిని 
ఏది పడితే అది తినే సహజీవుణ్ణి 
జనంచేత నిర్లక్ష్యం కాబడిన నిరక్ష్యరాస్యుడిని 
బలవంతుడిచేత నెట్టివేయబడ్డ బలహీనుణ్ణి 
మొత్తంగా బాధింపబడే బాధితుణ్ణి !

మాకు మింగలేనంత ఆహారమొద్దు 
కాని ఆరోజు గడిచే ముద్ద చాలు !
మాకు జల్సాలు చేసే మిద్దెలొద్దు 
ఆధారముండే కొంచెం నీడ చాలు !
మాకు పట్టలేనంత సంతోషాలోద్దు 
ఆప్యాయతనిచ్చే చిన్న ప్రేమ చాలు !
మాపైన శీతకన్ను వద్దు 
జీవనాధారానికి ఊతమివ్వండి చాలు !
మమ్మల్ని పనికిరాని వాళ్ళుగా చూడొద్దు 
కాని జీవులమని గుర్తిస్తే చాలు !!

అలా జరిగిన రోజున 
మనిషి మానవత్వంకు ప్రాణం పోసినట్లే !
మనిషి మనిషిని గుర్తించి మనిషైనట్లే !
అప్పుడు మేం అనాధలం కాదు 
నీడలేని నిర్భాగ్యులవ్వం 
మమ్మల్ని కూడా మీలో కలుపుకొని 
మాకూ తోడుందని పులకించనివ్వండి !!

25-05-2015.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!