"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Saturday, 2 April 2016

అర్ధాంగి

ఈ నేల అడిగింది నా చెలిని 
తనలో ఓ కొత్త దారిని ఏర్పర్చమని
నాతొ కొత్త ఆత్మానుభంధం పెనవేసుకోమని.!
జీవిత బంధమనే వేదికపై 
సామూహిక ఆశీర్వచనాల నడుమ ఒకటై 
పరిణయమని పేరు పెట్టాం. 
నా చెలే  నా అర్ధాంగయ్యక 
ఆనందం, అంతర్మధనం, బాధ, భావావేశంలతో పాటు 
మరికొన్నింటిని రుచి చూపించింది. 

అమ్మాయి నుండి అమ్మతనంలోకి మారి 
నన్ను ప్రయోజకుడిని చేసేసరికి
హృదయంలో జరిగిన అల్లరి చేష్టలు 
సంతోషం రూపంలో బయటకోచ్చాయ్. 
ఆడతనానికి పరిపూర్ణత నిచ్చినందుకు 
నన్ను చూసి మెల్లగా మెల మెల్లగా 
తన మేని ఛాయపై సగర్వమైన 
ఓ ఆనంద భాష్పాన్ని ప్రవహింపజేసింది. 

మా ఆలోచనలకు ప్రతిరూపాన్నిచ్చి 
ఇరువురి జన్మలను ధన్యం చేసిన క్షణమది. 
ఆ క్షణమే నన్ను కదిలించిన క్షణం. 
నా భవిష్యత్ నంతా తన వర్తమానంలో పెట్టిన క్షణం. 
ఆ క్షణ క్షణం నుండి నాలో 
ఏ నిరీక్షణనను దరిచేరనీయకుండా చేసింది. 
బాధించే భావోద్వేగాలన్నింటిని తనలోనే నిమగ్నం చేసుకుంది.
ఆనందించే పరిస్థితులను పరిచింది. 
ఒత్తిడిలో అలసి సొలసి ఆయాసపడిన 
నా తనువుకు ఉత్తేజాన్నిస్తుంది. 

నన్ను నేను వెతుక్కోవడమంటే 
తన అస్థిత్వమే నా రూపమంటాను. 
తన గురించి ఎన్నని చెప్తాం, ఏమని చెప్తాం. 
నా అర్ధాంగి రాకతో నాకిద్దరమ్మలు. 
శిశువుగా జీవం పోసిన అమ్మ!
ఈ దేహం కోసం జీవితాన్నేచ్చిన అర్ధాంగి!

06th July, 2013.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!