"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Saturday, 2 April 2016

అమ్మాయి

మోము ముంగిలిలో
సిగ్గుల మొగ్గలు
అమ్మాయి అందానికి గీటురాయి !
శివలింగాన్ని ఎల్లప్పుడూ 
అంటిపెట్టుకునుండే చందనంలా
నా చెలి తన అందాన్ని
తనతో అంటిపెట్టు కుంటుంది.
ఆమెది తమలపాకుల తనువు,
అందుకే నలగదేమో అన్పిస్తుంది !
తన దరహాసాలు సప్తస్వరాగాలు.
ఆ మాటల్లో ఏముందో మాధుర్యం 
నను తన వైపుగా లాగుతూంటుంది.
తేనెటీగలేనా తేనేను పంచేది -
నా చెలి పలుకులు కూడా
తేనేను ఒలికిస్తున్నాయి.


నేను ఓదార్చడమంటే
నా చెలికెంతో ఇష్టం.
అందుకోసమే  అలుగుతుంది.
అందుకోసమే నా ఒడి చేరుతుంది. 
ఓదార్చేకొద్దీ హత్తుకుంటుంది. 
తన సిగ్గుల హిమమును
నా వెచ్చని కౌగిలిలో కరిగించాక
నాలో తడిని రగిలిస్తుంది.!

అమ్మాయిలో
తెలియందేదో ఉంది !!
తెలుసు కోవాల్సిందేదో ఉంది !!!

09th July, 2014. 

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!