"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 15 February 2016

తరగతి

అమూల్య విజ్ఞాన సముపార్జన ఉంటేనేం
ఇతరులకు ఉపయోగాపడనేల.!
సమయము కోసం వేచి వుంటావేం
పదా ముందుకు.!
అణిగిమణిగి ఉంటే
అణచబడినట్లు కాదుగా.!
ఎగసిపడుతున్న అలను నేను
తీరం దగ్గరలోనే ఉంది.!
బౌతిక వీక్షణ ఎలా
సముపార్జనకు లెక్కలేదు.!
నేర్చుకొనుటకు తహతహ ఎందుకు
మొదలపెట్టు మెల్లగా.!

మారని ప్రవర్తన తొలిచేస్తుంది
అదిరిపడే ఈ మనస్సును.!
చూసే చూపులో దాగుంది
మాట్లాడితే తెలుసునుగా.!
పరిపక్వత రాని ఈ ప్రవర్తన
ప్రదర్శింపబడుతోంది పరోక్షంగా.!
ఓక్ వృక్షమైనా చేయునుగా
ఇతరులకు సహాయ రక్షణ.!
ఆలస్యమే అమృతం
అది కనపడునుగా మధనం తర్వాత.!
చిక్కు ప్రశ్నల బడి ఒడిలో బంధిఖానా
బయటకొస్తుంది చూడు.!
రెక్కలు లేని విజ్ఞానపు పక్షి
విహరిస్తోంది స్వేచ్చగా.!
మాటకే భయపడితే ఎలా
దగ్గరగా చూడుకనిపించును నేను.!
ఉలిక్కిపడే నేస్తమా
ఉరుములా ఆపదలోనూ మెరుస్తున్నావు.!
సంతోష సాగరానికి దోవ తెలిసేనుగా
ఇక ఆనందమానందమాయే.!
మోములోనే పలికిస్తా భావాల్ని
తెలుసుకోకపోతే ఎలా.?
మిణుగురంలో లేని నిరాశ
శోధిస్తే దొరుకుతుంది నాలో.!
తలవంచని కార్యాలు ఎన్నైనా అదిరిపడను నేను
తెలుసునా..!


తారుమారు తారాతమ్యంలో
తామరతంపరగా పడి ఉన్నా.!
ఉరుము నుంచి జారిపడిన ముత్యం
పయనిస్తోంది ఇక్కడ.!
సమయంతో సంబంధం లేదు
సమయపాలన చెంతనే నేనున్నా.!
ప్రయాణ ప్రణయంలో అలసితిని
వేకువజాముకోసం.!
తెలియని ఈ తప్పతడుగుల ప్రదర్శన
తెస్తోంది చేటు నాకు.!
తీరం వెంట పాద ముద్రలు
నిలవవుగా ఎక్కువ కాలం.!
- - - - - - - - - - - - - - - - - -
- - - - - - - - - - - - - - - - - - 
మౌనముగా భరిస్తున్నా
అల ఎగసిపడక మానదు.!
సంభ్రమాశ్చర్యాలలో మునిగిన ముఖకవళికలు
చూపిస్తున్నాయ్ ఆనందాన్ని.!
తెలుపక తెలిపిన మనస్సు
అడిగింది వయసు తోడు.!
ఎక్కుపెట్టి చూపినా పట్టదు
భగవత ఇచ్చ మార్చలేం.!

22nd July, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!