తారుమారు
తగువులుగానున్న తామసిలో
కనిపించని రూపాలు
చెక్కబడాలని
గురుకులాలు
వెలిసాయి గురువులతో.
గౌరవముగా రూపాంతరము
వుండాలన్న తపనతో
తలంపుతో
ఎక్కుపెట్టిన విద్యాబ్యాసన కార్యం
తలవంపులు
లేకుండా సాగిపోతున్న తరుణంలో,
రాకాసి రాక్షసి
పాశ్యాత్య ధోరణికి అంటిపెట్టుగా పాతుకుంది.
పరవశంలో పడి పరువు
పట్టని 'విద్య' అర్ధులు,
ఒకెత్తు
ప్రవర్తనను
సమిక్షాలోకంలో
పడేయాల్సిన విద్య బోధకులు,
ప్రవర్తన పరివర్తన
పేరుతోమరోలా మారుతున్నారు.
కీచకుడి కీచురాళ్ళ
శబ్దంలా పెరుగుతున్నారు.
విద్య బోధకులుగా
కాదు మభ్య కాముడిలా
అంతా 'కామన్' కాదు 'కామ'మేనంటు
ఆర్జకులకు
ప్రోత్సాహం అందిస్తున్నారు.
తప్పుల తప్పతడుగుల
ఈ తాపాలు,
రెప్పలను అడగక
తెలియని ఈ మజిలీ,
సములాగ్ర మార్పులకు
నోచుకునేదేన్నడు...?
05th
September, 2011.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు