ఆ సుందర వదనంలోని హెచ్చు తగ్గులు
పడుతున్న కష్టాలకు
సూచికలు.!
చెక్కు చెదరని
ధైర్యమింకా
ఏదో సాధించాలని
ప్రదర్శింప పడుతోంది.!
భారతావని
సంప్రదాయానికి సాక్ష్యమంటూ -
కార్మిక కర్షక శ్రమ
జీవనానికి సంకేతమంటూ -
కంటి కోసల మధ్య
బంధీ అయ్యింది తిలకం.!
సంగీత తీగల్లాంటి అదిరే
అధారాలు
ఆమెలోని
భావావేశాల్ని చెప్తున్నాయి.
ఓపిక లేక అలసిపోయామన్న
నయనాల
తెరల వెనుక నుండి
ప్రవహిస్తోందో నీరు.!
బయటికొచ్చిన
క్షణాల్లోనే
ఆవిరవుతామని
తెలిసినా
వాటికి భయం లేదు.
తమ బలం తరగదని,
వెన్నంటే ఉంటూ గుర్తు
చేస్తామని,
తనలోనే
ద్విగుణీకృతం చేసుకుంది.
కళాకారుల ప్రతిభను
ప్రశ్నించేలా,
కవుల మనస్సును
ఒకింత తన గురించి
ఆలోచించేలా,
చంద్రుని ఎదలో
నిప్పుల్లా
ఆమెలోని భావాలు
వెలుగుతున్నాయి..!!
04th April,
2012.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు