"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Sunday, 7 January 2018

మొక్క

వివిధ పొరలతో కేంద్రీకృతమైన ధరణిపై,
శాఖోపశాఖలుగా వృద్ధి చెందుతూ -
జగన్మోఖ వెలుగు కారుణ్ణి దర్శించాలన్న తపనతో,
చిన్న చిన్న అడ్డంకులన్నింటిని తొలగించుకుంటూ, 
జగతికి శోభనిచ్చే ఓ బృహత్తర కార్యానికి ఒడిగట్టి, 
అణకువతో మొలకెత్తాము మేము..!

మా ఆరాధన నేడు ఆవేదనైంది.!
మా ఆశలు అడియాసలుయ్యాయి.!
మా కష్టాలు కన్నీళ్ళయ్యాయి.!
ఎవడి కష్టం ఎవడికి కావాలి..!
ఎవరి ఆవేదన ఎవరు పడతారు..!


మమ్మల్ని చూడనిదే
మబ్బులకు ఆకర్షణ పుడుతుందా.?
మేము రాకపోతే  
వాయుదేవునికా పేరు ఉంటుందా.?
మేమిలా ఉండకపోతే
ప్రకృతిలా శోభనిస్తుందా.?

దేశంలో జననాభివృద్ధి కన్పిస్తుంది
కాని దినదినాభివృద్ధి కన్పించడం లేదు.
దానికోసమే ఆరాటపడుతూ
మమ్మల్నే పెకిలించివేస్తారా.?

మా అలక - మీకు ఉక్కపోత.!
మా అల్లరులు - మీకు జోలపాటలు.!
మా ఆవేశం – మీకు వినాశనం.!
మా కష్టం - మీకు ప్రతిఫలం.!
మా శక్తి - మీకు ఆహారం.!
మా చీకటి – మీకు వెలుగు.!

08th March, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!