"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 24 July 2017

దర్జీవాడు

దర్జీవాడు !
పేరులోనే దర్జా - జీవితంలో.?
కంటిచూపుకు తీక్షనెక్కువ.!
దర్జాగానే కూర్చుంటాడు.
చరణాలు మాత్రం కదులుతూనే ఉంటాయి.

చక్కని ఆలోచన బయటకొచ్చినప్పుడే కళ !
ఈ కళలో పది దారాలు కళకళలాడతాయి.
అవేన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 
అనువైన రూపాన్ని సంతరించుకుంటాయి.

వివిధ దారుల నుండి ప్రయాణిస్తూ -
కనువిందైన శృంగ ద్రోణులను సృష్టిస్తూ - 
సరికొత్త హోయలను ఒలకబోస్తాయి.
ఈ అద్భుతమైన కళను చూస్తూ సంతసించడమే!
అది ప్రతిఫలం అందే విషయంలో ఉండదు.

అలాంటి వేళనే
రెడేమేట్ లంటూ దుకాణాలు వెలిశాయి.
స్వప్రయోజకుడిని ముంచాయి.
స్వయం కృషికీ గండి కొట్టాయి.
తప్పని పరిస్థితిల్లో -
నిర్దిష్ట సమయాల్లో జీవనోపాధి చేస్తున్నాడు.

కాకతాళీయంగానె మనుషులు మారిపోతారు.
నిన్నటిది ఈ రోజుకు నచ్చనప్పుడు 
ఈ రాజుది రేపటికి నచ్చుతుందో లేదో..!
నమ్ముకున్న కళ
వంచిస్తుందా ఏ వేళైనా .!
రోజంటే రాత్రి పగలు తప్పవు -
జీవితమంటే ఆటుపోట్లు తప్పవు..!! 
28th February, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!