ఏమిటీ మంకుపట్టు ..!
ఆశపడినప్పుడు అందకుండా
కోరుకున్నప్పుడు కురవకుండా
రమ్మన్నప్పుడు రాకుండా
పరాచాకాలడుతోంది వర్షం.
ఏమిటీ విన్యాసం ..!
తనువంతా వయ్యారాలు
నింపుకొని
కాళ్ళకు గజ్జెలు కట్టుకొని
నేలతల్లిని చేరిన ఆ కూతురు
ఆనందంతో నాట్యం చేస్తుంది.
ఏమిటీ అలంకరణలు ..!
తోబుట్టువులను చుంబించిన
చోట
స్నేహితులను కవ్వించిన చోట
తన రాకతో జీవం తెచ్చి
కొత్త ఆశలకు పురుడు
పోస్తుంది.
ఏమిటీ వైపరీత్యం ..!
కమ్ముకొచ్చిన కారుమబ్బులను
చీల్చేయ్యాలని
సహచరుల జీవన గమనానికి
అడ్డుపడుతున్న
మానవజాతికి గుణపాఠం
చెప్పాలని
కుండపోతగా వచ్చి
పడిపోయింది.
అస్తవ్యస్తానికి
చిరునామాయింది.
వర్షంలోని విభిన్న కళలు
మనల్ని నిద్ర పోనివ్వకుండా
చేస్తాయి.
మన చేష్టలు
శ్రుతిమించినప్పుడు
వర్షం విజ్రుంభిస్తూనే
ఉంది.
మనల్ని తనలో కలుపుకుంటూనే
ఉంది.
25th October, 2013.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు