సాయంకాలం సూర్యకిరణాల చేత
దూరంగా నెట్టివేయబడ్డ
మేఘాలు
అదృశ్య హస్తాల చేత కొండలై
ఒక్కో అడుగులా
పరచుకున్నాయి.
రూపమెరుగని గాలి రాకపోకలు
శూన్యంలో సృష్టించే చిరు
అల్లరులకు
తనువంతా గాయాలు చేసుకున్న
మేఘం
జాలువార్చె ఆనంద భాష్పాలే
వర్షం.
మనిషి ఆనందభాష్పానికి
మనస్సు తడుస్తుంది.
మేఘం ఆనందభాష్పానికి పుడమి
తడుస్తుంది.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు