ప్రేమికుల రోజు.!
ప్రేమ జననానికి
చిహ్నం.!
ఏదైనా చేయాలనిపించే
తపనలు
మొదలైంది ఈ పదం
పుట్టకేనేమో.!
ప్రతి దానిలోనూ
మార్పు అనివార్యమైంది.
ప్రేమ పెరగడమో తరగడమో
జరక్కుండా
భిన్నమైన పరిణామాలు
ఎదురౌతున్నాయి.
వయసుతో సంబంధం
లేదంటున్నాయి.
నీటి ప్రవాహంలా
కదలాడే హృదయాలపై
తప్పుకోలేని
దారులను గీస్తున్నాయి.
నిర్థిష్టమైన ఓ
నిర్వచనంతో మెలగలేనిది
ఒక్కొక్కరికి
ఒక్కోల అనిపించే ఈ ప్రేమే
రకరకాల నెపంతో
చొరబడుతుంది.
సమయం కోసం
వేచియుండే గుంటనక్కలు,
బాధను
మిగుల్చుతున్నారు.
ఇదే జీవిత పరమార్దమంటూ
పెళ్లి చేస్తున్నారు.
ప్రణాళికల
పరిమాణంతో పనిలేదు...
స్నేహం-ప్రేమల మధ్య
భేదం బోధపడదు...
యువత తప్పుదోవ
పడుతుందంటూ విమర్శిస్తారు...
అనైతిక చర్యలకు
పాల్పడుతారు...
జాతిని జాగృతి చేసే
విధానం ఇదేనా..!
ఈ రోజే వారికనువైన
సమయమా..!
మిగతా రోజులలో ఎలా
తిరిగిన పట్టదా..!
ఓ యువ రక్తమా!
సమాజానికి
కనువిప్పు కలిగించండి.
దర్పణంలా గజిబిజిగా
కాకుండా,
ఆమోదయోగ్యకరమైన
పద్దతులలో బేధాలను బోధపరుస్తూ -
రెప్పపాటు దూరమే
క్షణాకాల సమయమని,
సరైన సమయమే సరైన
నిర్ణయమని,
ఎవరికీ
చెప్పుకోలేని ఈ వయసు బాధను
అనుభవించి
తీరాల్సిందేనని,
కానప్పుడు
అనుభవమయ్యే తీరులో
తెలియజేయాలని
కోరుకుంటూ -
ప్రేమతో ప్రేమికుల రోజు శుభాకాంక్షలు.
14th February,
2012.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు