ఆలోచనలు
విస్తరిస్తున్న ఓ కుర్రవాడు -
ప్రేమ మాట విని దాని మోజులోనే పడ్డాడు.
సంతోషమింకా
పెంచుకోవాలని తాపత్రయపడ్డాడు.
అది కాస్త ప్రక్క
దారి పట్టింది.
నమ్ముకున్నామె మోసం
మోజు కూడా చూపించింది.
పూర్తిగా నిశాన్ని నింపేద్దామనుకునేసరికి
కంటి తెరల వెనుక
గతం కదలాదిండిలా –
"జననం నుoచి చాలా వాటితో సహజీవనం.!
మెచ్చుకోలుగా
నజరానాల ప్రకటింపు.!
నజరానాలకు
ఉప్పొంగిపోయామనే సంకేతంగా -
తీసుకొన్న గాలి బయటికొచ్చిన
శ్వాస .!
ఇంతలోనే ముఖకవళికల
మార్పు.!
వయసులోని ప్రమాదం
పరుగుపెట్టే.!
చిన్న కార్యానికే
ఏదో చేసేశామనే పెద్ద గర్వం.!
సూక్తులకు
తలవంచనిదే ఈ నైజం.!
సరికొత్త సంకోచ
ఘడియలు - సరిగ్గా
అప్పుడే మొదలుపెడతాయి.!
సందిగ్దంలో
పడవేస్తున్నమనస్సు.!
ప్రస్తుత
పరిస్థితులపై ఆరాలు.!
కావాల్సిన
కొన్నింటి పైనే ఆకళింపులు.!
పుంజు కొచ్చిన
మనస్సు బిగింపు ధైర్యం.!
కొత్త వ్యక్తితో
సావాస సహజీవనాలు.!
స్వర్గమంటూ లోతు
తెలియక మునకలు.!
చాప క్రింద నీరులా
పెరిగే ఆబద్దాలు.!
గోడకట్టుకున్న
అబద్దాల మునకలు -
కూలిపోయెను మనస్సు
లోతుల్లోకి.!
తప్పుకోనేను ఈ
వ్యక్తి లౌకికంగా.!
తగ్గని గాయానికి
పెంపుదలగా తోడుంటూ -
సంబంధం లేదన్నట్లు
చిత్రమైన ప్రయోగాలు.!
బందీఖానా నుండి బయటికోచ్చినా
బందీఖానా నుండి బయటికోచ్చినా
బందీలోనే ఉన్న
మనస్సాక్షి ప్రమాణాలు.”
కాసేపు నిగ్రహంగా
నిలబడి ఆలోచించి తెలుసుకున్నాడు.
ప్రేమంటే ఒక్కరి
దగ్గరే ఉండదని,
ప్రతివారి చూపులోనూ
చేతి స్పర్శలోను మాట
తీరులోనూ
అడుగడుగునా
ఉంటుందని.!
ఉపయోగపడని ఈ
జ్ఞాపకాల నుండి తప్పించుకొని
తల్లిదండ్రుల
సంతోషమునకై జగతిపై నుండెను.!
ఆటుపోట్లను
ఎదుర్కొన్న మనస్సుకు
ఏదైనా సాధించగలననే
ధైర్యం వచ్చెను.!
జీవితంలో పోరాటానికై
రచించుకోనేను ప్రణాళికలు.!
మరెందుకు
చాలామందిలా ఆలోచించ లేకపొతున్నారు ?
03rd January,
2012.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు