"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Thursday, 2 February 2017

ఫ్లాట్ ఫారం జీవితాలు

రహదారి వెంబటి ఫ్లాట్ ఫారమే పాన్పు అయింది.
రకరకాల ఋతువులు వచ్చి వెళ్తున్నట్లే
రకరకాల మనుషులు దాటుకు వెళ్తున్నారు.
నాకేంటిలే అనుకుంటూ పోతున్నారు.
కాలాన్ని ఆగమని చెప్పలేనట్టుగా
మా దుస్థితిని చూసి స్పందించమని చెప్పలేను.
ఋతువులు గడుస్తున్నాయ్.!
ప్రకృతి వాటికి అనువుగానే మారుతుంది.
స్పందనగుణం మానుకున్న మానవులు
వారి గురించే వారు పట్టించుకోవడం లేదు.
సంధ్య వేళతో మొదలైన దినచర్యను
గమనించే ఏ ఒక్కరినైనా చూస్తుంటే -
కనీసం నన్నో జీవిలాగానైన చూస్తునందుకు
వస్తువులా ప్రక్కన పడవేయనందుకు
ఆనంద పరవశం.!

మారుతున్న పరిస్థితులు నాకు తెలుసు,
పొట్ట కూటికి తెలియక సమయమయిందంటూ పిలుస్తోంది.!
పక్షులలాగా కొంచెంకొంచెం సంపాదించాను.!
బయలుదేరాను ఒక బాటసారిలా.!
తనువులో కలసిన ఈ అల్ఫహారం
కాసేపు ఆకలి దప్పికలను ఆపుకోమంది.

అసూయ ద్వేషాలను పట్టించుకోకుండా -
ఎల్లప్పుడూ కాదనకుండా –
నా ఆసరా అయిన ఈ ఫ్లాట్ ఫారం
ఎంత సహాయం చేస్తుందో కదా...
తన ఒడిలోనే దాచుకుంటుంది భలే...

సాయంకాలంలో పక్షిజాతి సందడి
నా ఆనందాన్ని పెంచడం కోసమేననిపిస్తుంది.
నా అంతర్ముఖంలో బాధే ఆవహిస్తుందని,
ఎప్పుడు ఏ వేళలో లావాలా బయటకోస్తోందోనని
వాటికేమి తెలుసు పాపం...

సంకోచిస్తున్న కండరాలు వెచ్చదనం కోరుకోగానే
తల్లి ఒడిలోనే బిడ్డలా ఒదిగిపోమ్మని
కావాల్సినది కప్పుకోమంటూ సంకేతమిస్తున్న ప్రకృతిలో
భాస్కరుడు తన తీవ్రతను తగ్గిస్తుంటే
చంద్రుడు తన తీవ్రతను పెంచుతున్నాడు.
మా లాంటి వాళ్లు తప్ప
మిగిలిన వాళ్ళందరూ భాస్కరునికే ఓటు వేశారు,

ఎవరూ చుడరనే ధీమాతో -
లోలోన అంతర్భాగాల్లో గూడుకట్టుకున్న
బాధా పక్షులు బయట కొస్తున్నాయి..
ఉన్న తడి ఆరకముందే రేపటికి వాయిదా అంటూ
మమ్మల్ని ఆపెస్తున్నాడు సూరీడు.
బహుశా మాకులాగానే
సూరీడు ముందు చంద్రుడికి విలువలేదేమో !

నిన్నలా జరిగిన గత కాలం ఏమైనట్లు.?
మార్పు ఏదైనా మారుతుందా మా అడుగు.?
మాకున్న పరిస్థితులలా మమ్మల్ని మార్చేశాయి.
భాస్కరుని రాక, చంద్రుని పోక
కష్టాల కడలి నుంచి సుఖాల సరస్సుకే...
తరగని తడిని తగ్గించుకోవడానికి,
వెంటనే మరణ శయ్యపైకి వెళ్ళలేక
చంద్రుడెప్పు డోస్తాడని ఎదురుచూపులు.!
అందుకే అనుకుంటాను
నా ఊహే నా ప్రమాణమని..!!

05th December, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!