మేమంటే చాలామందికి
చిన్న చూపైంది.
గౌరవముగా ఉండడానికి
మాకూ ఉంది హక్కు...!
ఒక జాతికే అంకితమైన
మా జననాలు
మాకో ప్రత్యేకతలను
ఆపాదించాయి.
పెరిగే ప్రతి భాగంలో
ఉవ్విళ్ళ ఆరాటానికి తెరదించిన కాలం
జన జీవన
స్రవంతిలోకి నడిపించింది.
ఏవేవో అనుకున్నమిలా
-
“దేవుని ఆరాధన
దగ్గరున్నప్పుడు ఓ భావన,
ఆయనను పావనం
చేస్తున్నామని !
మనిషి శరీరంలోకి
ప్రవేశించగానే పులికింత
కణాలను శుభ్రం
చేస్తున్నామనే ధీమా !
మిగిలిన జాతులతో
కలవగానే వాటివైపు చిన్న చూపు
మేము లేనిదే వాటికి
విలువ లేదని !
పరిశ్రమలలో
అడుగిడగానే ఓ గర్వం,
ఏ ప్రదేశానికైనా
ద్రవ రూపంలో ప్రయాణిస్తున్నామని !
చేనేతల చేతుల్లోకి చేరగానే
ఓ ఆనందం
కొంతమందినైనా
బందిస్తున్నామని !
నిరుపయోగంలో
కాలిపోగానే ఓ పరవశము,
మరో రూపంలో మగువుల
కరములపై కనిపిస్తామని !
గృహసముదాయాల ముందు
వేలాడగానే ఓ ధైర్యం
అజాత శక్తులను
ఆపుతున్నామని !”
తర్వాత గాని అర్ధమవ్వలేదు.
వ్యాధి
నిర్మూలన శిబిరాలకు చేరితే
అనుభవమయ్యింది మా
జీవితము!
ఎప్పుడూ ధరణిని
ముద్దడుతున్నాం అనుకున్నాం
ముక్కలు ముక్కలుగా
అవుతున్నామని తెలిసిరాలేదు.
రోజూ చూసి చూసి
సుగుణాలను కోల్పోయాం.
ఎవరి గొప్పతనాలు
వారివని తెలుసుకోండి...
ఒకరికి ఒకరికి
పొంతనే ఉండదు.
సమయ సందర్భాలే
నిర్దేశకాలు అవుతాయి...
గొప్పతనాలనేవి
ఉపయోగాల విలువ కొరకే ..
అవే సమయ సందర్భాలు
వెనక్కి నేట్టేస్తాయి.
దిష్టి తీసే నీరే
కాదది !
మాలోన కమ్ముకున్న
బాధాతప్త నీరు !
చినుకుల్లా
వెదజల్లు !
తప్పించుకొనే
మార్గం కొరకు వేడుకుంటూన్నాం !
ఒక్కో సమయంలో ఒక్కో
వ్యధ
నోరులేని వాటి
పరిస్థితి ఇంతే కదా.?
పిచ్చి మొక్కల్లా మా
దారిన మమ్మల్ని ఉండనివ్వరు కదా.?
అయినా అయ్యో
అనుకుంటూ ఉండం.
మా ప్రత్యేకతలింకా
నిలిచే ఉన్నాయి.
ముక్కలుగా మారిన
మమ్మల్ని
మూడు పూటలు
పొట్టకూటి లేని వారికి
ఆపద్భాందవుడిలా మేమే
చేయూతనిస్తున్నాం.
ఈ తృప్తి చాలు
మాకిక !!!
23rd December,
2011.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు