ఆకాశం
అందని ఓ నవలోకం.
ఆశకే ఆనందం వచ్చిన సందర్భం…
ఆలోచనకే ఆచరించాల్సిన కథనం…
నడకల స్థానే పరుగులు ఉన్నప్పుడు,
నా కనులకు ఆకలి పెంచే
రూపాన్ని చూశాక -
తేనేలాగా ఒంటికి పట్టిన
చెమట బిందువులు
తనువుతో అనుబంధం అడగాలనుకున్నాయ్ !
తన మాటల పల్లవికి లొంగిన
నేను
పల్చని అక్షరం పాపాయి పలకపై
లావేక్కినట్లు
చూపు తిప్పుకోలేని వయసు కోతతో
చేసిన వలపుల సంతక
ప్రమాణాన్ని గమనించాక
పరిణామక్రమంలో భస్మమయ్యాను
ఏకాకి రూపంలో....!
21st October,
2011.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు