జననముతోనే తెలుయునా
జగతి గురించి.!
కదిలే ప్రతి రోజూ రాదా మన వెంట.!
ఎదురు చూడక పయనించమా.!
బ్రతకడానికి కావాలిగా పంచ భూతాలు.!
ఉండాలిగా డబ్బు సహాయం.!
ఎవ్వరి దగ్గరనైన కాదనక ఉండునుగా.!
కదిలే ప్రతి రోజూ రాదా మన వెంట.!
ఎదురు చూడక పయనించమా.!
బ్రతకడానికి కావాలిగా పంచ భూతాలు.!
ఉండాలిగా డబ్బు సహాయం.!
ఎవ్వరి దగ్గరనైన కాదనక ఉండునుగా.!
అయినా ఎందుకీ డబ్బు మదం.?
తనలోకే మనల్ని లాక్కొంటుందా
లేక మనమే తనలోకి వెళ్తున్నామా.?
పరిమిత కోరికలే అవసరాలైనప్పుడు
సహాయపడదా దారి మళ్ళించకుండా.!
తరగని కోరికలు మనలోని
రెండో వ్యక్తిని మేల్కొల్పితే ..!
ఆశలే అతి కోరికలుగా
మారినప్పుడు
దొరక్కుండా
భళ్ళుమనిపించదా.?
పరితపించడా డబ్బు దొరికే మార్గం కొరకు.!
త్రోక్కడా అతను అడ్డ దారులు.!
చిక్కడా తప్పుల కారాగారంలో.!
పరితపించడా డబ్బు దొరికే మార్గం కొరకు.!
త్రోక్కడా అతను అడ్డ దారులు.!
చిక్కడా తప్పుల కారాగారంలో.!
రకరకాల కోరికల
నెపంతో
మనమే డబ్బును
ఆవహిస్తున్నాము.
ఆశల తాళ్ళతో
బంధించి
తరలిపోకూదడనే పట్టుదలగా శ్రమిస్తూనే ఉన్నాం.
అహంకారాన్ని పెంచే పంచభూతాలే పంచముఖాలై
మన ముందు విరాజిల్లుతున్నా ఎందుకీ ధన మదం..?
కోరికలే అతి కోరికలుగా మారకుండా ఆపుకోలేక
సరియైన గమ్యమంటూ ఏదీ లేక
ఏమి చేయాలో, ఎలా చేయాలో తెలియక
ఏవేవో చూసి, ఏదేదో కావాలంటూ -
తెలుసుకోలేని తప్పుల దారిలోకి అడుగులేస్తూ -
దొరికిన డబ్బును ఖర్చు పెడుతూ -
విలాసాలకు అలవాటు పడుతున్నాడు.
తరలిపోకూదడనే పట్టుదలగా శ్రమిస్తూనే ఉన్నాం.
అహంకారాన్ని పెంచే పంచభూతాలే పంచముఖాలై
మన ముందు విరాజిల్లుతున్నా ఎందుకీ ధన మదం..?
కోరికలే అతి కోరికలుగా మారకుండా ఆపుకోలేక
సరియైన గమ్యమంటూ ఏదీ లేక
ఏమి చేయాలో, ఎలా చేయాలో తెలియక
ఏవేవో చూసి, ఏదేదో కావాలంటూ -
తెలుసుకోలేని తప్పుల దారిలోకి అడుగులేస్తూ -
దొరికిన డబ్బును ఖర్చు పెడుతూ -
విలాసాలకు అలవాటు పడుతున్నాడు.
దాని చుట్టూ ఓ మాయా భండాగారమే ఉంది.
ఎంతటి వాడినైన మార్చే ఉత్ప్రేరకమవుతుంది.
ఆలోచనా శక్తిని పెంచగలదు.
సరియైన గమ్యాన్ని చూపించగలదు.
నలుగురిలో ఒకడిగా నిలబెట్టగలదు.
చుట్టూ ఓ రక్షణ కవచాన్ని ఏర్పరచగలదు.
అధముడిని విజయుడిగా మార్చగలదు.
మాయా మహత్తు కలిగిన ఓ ధనమా
మాపైన నీకెందుకింత కోపం..?
ఉండీ ఉండక మమ్మల్ని బాధించడం తగునా...?
24th October,
2011.
hi...,
ReplyDelete