వేస్తున్న తోలి
అడుగులతో..
గమ్యానికై నడుం
బిగించి..
అలసిపోతున్న చరణాల శబ్ధాలలో..
ఆలోచనలను ఆచరణలో
పెట్టుకుంటూ..
ప్రయోగాత్మకంగా
పరిశీలనాత్మకతను అలవర్చుకుంటూ..
ప్రతిభను
ప్రభావంతముగా పదునుపెడుతూ..
పోటీల సంకుల
సమరమునకు ఆహ్వానం పలుకుతూ..
అడ్డువచ్చిన
అభిప్రాయభేదాలను తొక్కొపెడుతూ..
గడిపేసే
సరలరేఖలలాంటి సమాంతరపు జీవనం యువతది..!!
అవుననో కాదనో
ఎటువైపూ
తేల్చుకోలేని అపరిపక్వత మనస్సులు
ఇంకా ఒత్తిడులనే కార్చుచ్చుల మధ్య నలిగిపోవాల్సిందేనా ...?
27th May, 2011.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు