"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Sunday, 11 December 2016

సావాసంతో

ఉరకలేసే ఉరుముల పరవళ్ళు..
పరవళ్ళు తొక్కే ఉప్పెన పరుగులు..
ఉప్పొంగిపోయే మయూర ఉల్లాసాలు..
నయనాలను కదిలించే నాట్యాలు..
యమునా తీర సంధ్యా రాగాలు..
శబ్ద:లయ శ్రుతుల తాళాలు..
శ్వాసలాగ మారిన వాక్కులు..
వాహనాలైన గంగా ప్రవాహ గీతాలు..

ఆకాశమే ఆపలేని చినుకు వస్తువులు..
గొప్పలు చెప్పుకోని పొడుపు కధలు..
చంద్రునికే కనిపించని ఏకాంతాలు..
ఫలితాలతో ప్రయాణించే ప్రణయాలు..
మైమరపించే ఆనందాల వెన్నెలలు..
ఇలా ఎన్నోఇంకా ఎన్నెన్నో
దగ్గరవుతున్నాయ్ నా చెలి సావాసంతో..!!                 

02nd May, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!