"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Friday, 30 December 2016

గర్వం

హత:విధి ...
ఇది వింత కథ!
బోధపడని పరిచయ కథనం.! 
తరగతుల సంయమనం కుదరక ... 
తలగోక్కున్నా ఏమీ అర్ధం కాక ...
గర్జించెను ఓ ఆటవిక కథకుడు..!

మనస్సునందు మొలకెత్తిన కొత్త లక్షణాలు ...
గర్వంతో ప్రవర్తించిన క్షణాలు ...
మనశ్శాంతిని కబళించిన ప్రమేయాలు ...
నలుగురిని దూరం చేసిన అహంకారాలు ...
ఏమరిపాటుగా ఎగసిపడితే ఏం లాభం...
హక్కుల పరిగణలోకి బందీఖానా కాదా అది..?
తప్పులందు తప్పులు ఎరుగక మిడిసిపడినా ...
అందని పండు దొరకునా మున్ముందైనా ..! 

మనోభావాల మనోవేదనలతో మధనాలు ... 
వాక్కుల చతురతకు దక్కాలనే చింతనలు ...
ఫలితాన్నివ్వని ప్రజ్ఞాపాటవాలు, వెక్కిరింతలు ... 
పురిగోల్పెను ఆ అపరిపక్వత మనస్సును.!
కబళి౦చెను  కార్చిచ్చుల కథను.!

20th October, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!