"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Friday, 18 November 2016

ప్రేమికుల రోజు – 2011

ఎవ్వరి గురించి
గడిపేసే ఈ కాలానికి తెలియదు.
ఏ గాలి
పరిశీలించే ఈ మనస్సును తాకలేదు.
ఆకాశపు చూపులతో
సాయంకాలాలు గడుస్తున్నాయ్.
ఏకాంత వేళలో ఏ కాంతీ లేదని
అనుకున్నాకే కదా ఈ తనువును తాకి
సుస్వారాల సరిగమల నా పాటకు శ్రుతివై
గుండె తలుపులను త్రోశావు.

వయస్సులోని పసితనమా !
కప్పివుంచిన సమయమా !
పరవశించే హృదయమా !
అడుగులోని గుర్తుగా అనిపించే భావమా !
తెలియదా నీకు.?
ఆకాశపు చూపులతో
తన పేరును పలకగానే
తెరమరుగున భారం మోసుకుంటూ తిరగక శబ్దం చేసేను.!
అది తెలిసిన నా ప్రణయం నీకై పరిగెత్తేను.!

సూర్యుని మాట వినే కదా వెన్నెల కాచేది.
ప్రేమ మాట వినే కదా నేనోచ్చేది.
తొలి భావాలను నా చెలికి చెప్పే రోజే
 ప్రేమను కాదనలేని ప్రేమికుల రోజు.               

14th February, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!