"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Tuesday, 29 November 2016

నిరూపించు

ఎగిసే ఆవేశం ఎందుకు
అందదుగా ఆకాశం అని అనుకోకుండా
లక్ష్యం చూపుతూ స్వాగతం పలకరా!
దైనందిన జీవితానికి అంకురార్పణ చేయరా!
ప్రక్షాళనలో పావువంతైనా
భాగం పంచుకుంటూ ముందుకు సాగరా!

ఆలోచించక ముందడుగు వేయమని
యేటి ఈ నాటి మహిళలను కోరుతున్నాను.
సాధికారతలో ఏముంది సాధించడానికి,
నేటి అబలలో చూడు సబల దాగుందని నిరూపించాలి.
రెండు చేతులను కలపగా వచ్చే శబ్దార్ధం ఒకటే!
లెక్కించలేని ఆలోచనల తీర గమ్యం ఒకటే!
వర్తమానమే భవిష్యత్ లా సాగాలి!
మీ తపన పౌరుషం పెరగాలని కోరుకుంటూ
ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ..!!

08th March, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!