"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Tuesday, 8 November 2016

కొత్త సంవత్సరం – 2011

నీతోపాటుగానే కదా ఈ జీవితం
దేనిని కోరుకునో నీ వెనకే వస్తున్నాం
అడిగామని ఆగవు కదా !
అరే ఏమిటీ తపన..?
కరగని గుండె వ్యధ ఇది !!
నీ వలెనే కదా ఈ పరిణామాలు.
నిన్ను తలుస్తూ
ఎవరికీ వారే గిజిగాడికి చిక్కామనే చింతన !
చిత్రమైన ఈ చింతన ఛీత్కారం పొందాలి
ఎర్రని భాస్కరుడు ఈ చీకటిని చీల్చాలి !

అడుగుదూరంలో నిలబడ్డ భవిష్యత్తుకు
ఆ సంధ్య వేళ వీచే గాలి లాలనకు తెలుసులే
స్వాగతంగా సాధనమైన ఈ సాకారం సాగిపోవాలని,
నీలో ఉత్పరివర్తనాల వల్ల
కొత్త ఆశలను చూడాలని ఆశిస్తున్నాను..!!

01st January, 2011.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!