పరవశంలో మదిలేస్తూ
నిను చూడగానే చెలి
-
కొత్తగా
క్రొంగొత్తగా అవతరించెను నాలో,
స్వచ్ఛత మనస్సుల
దారిలోకి పయనించెను.
నాభ్యంతరాలంలో
నిక్షిప్తమైన గది తెరుచుకొనే !
నీవే మత్తుగా
నాకే
అనిపించేటట్లుగా కనిపించావే
ఇక
నా వంశధారలో
కలసిపోవాలని ఆశించనే !
నీకు
వ్యక్తపరచాలంటే
మది మధురిమ ఆపేనే.
ఇకనైనా మౌనమా
పలుకలేవా . . !
ప్రణయమా
పరుగులెత్తలేవా . . !!
శ్వాసలోన ఆశవై
పురివిప్పిన హృదయమా . . !
నా చెలి యందు
భావవ్యక్తీకరణకు దూరం అంటావా . .?
అలవాటులేని పరవశమా
నిన్నే
నమ్ముకున్నాను . . !
ఎప్పటికైనా నా
చెలికి చెప్తావని.
ఏం చేస్తావో మరి .
. . !
09th September,
2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు