ఎదలో సవ్వడి
అది జరిగెను నీ
వల్లే !
మదిలో అలజడి
అది ఆశపడెను నీ
కోసమే !
మది తాపత్రయమంతా
ఎదురు చూస్తున్నది నీ
రాక కొరకే !
నిన్నే చూడాలని
ఇక సెలవన్నాయి నా కలలు !
నీతో ఏకమై సాగడం
లేదని
సెలయేరైనవి ఈ కనులు
!
ఎద లోపల దాగున్న
ఇష్టాలను
నీకు తెలిపేందుకు
ప్రతీ చోట నిన్నే
తలుస్తూ
నన్ను నేను పలకరించుకుంటున్నా
. . !
కొన్ని చిలిపి సంఘర్షణలతో
మరి కొన్ని సరదా
సంఘటనలతో
అప్పుడప్పుడూ
బాధపడినా
సంతోషంగానే
ఉన్నామని, ఉంటామని
సాగిన మన
సాంగాత్యంను పరికిస్తే అవగతమవుతుంది.
వసంతాల ఎడబాటును
తట్టుకోలేక
ఈ క్షణమే నీ చెంతకు
చేరాలనిపిస్తుంది.
సూర్యుడల్లె గుచ్చి
గుచ్చి చూస్తె నేనేమి చెప్పను
సౌమ్యముగా వెన్నెలను
తెచ్చి
పగలంతా కాయించగలనుకాని
...!
ప్రయత్నిస్తున్నవో పరీక్షిస్తున్నవో
తెలియట్లేదు
నాకు దూరం కావోద్దనిపిస్తుంది.
లిప్తపాటు క్షణ సమయంలో
కూడా గుర్తిండిపోవాలని
రెప్పపాటు మాత్రమైనా
దూరం వద్దని
నువ్వు కాలమై
దరిచేరాలి చెంతకు
నాలో కోలువైన నీ
పేరు లేని ప్రేమను ఊహించేదేలా.
05th
June, 2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు