ఆ కనులలో
ఏమైపోయినాయి ఈ కలలు
కలతలేని మనస్సును
కలవరపాటుకు గురి చేశాయి.
మొలకెత్తిన ఆశ
చిగురించి ప్రవాహంలా వస్తుంటే
మది ప్రయాణం
అన్వేషణకై బయలుదేరినది.
నా కోసమే జనియించిన
గ్రహణంలేని ఓ
తారకోసం
తారాలోకపు
ప్రదేశాలలో ఉపగ్రహాలతో శోధిస్తున్నా.
కనుగొని తనవంకే
చూస్తున్నా.
తనుమాత్రం ఏమియూ
తెలియనట్లే
జలపాతాల్లోసంతోషంగా
జాలువారుతూ
సొగసుతో
ఆశపెడుతుంది.
ఈ ఆశే పెరిగి మాటిమాటికి
కెరటంలా తీరంకు చేరుతుంది.
ఆశకేమి తెలుసు
తను తీరం వెంట
దొరికే శంఖం కాదని
ఆల్చిప్పల్లో
తళుక్కున జాలువారే ముత్యపు చినుకని.!
ఇవాళెం జరుగుతుందో తెలియట్లేదుకాని
మది నిన్నే కోరి
వెంచేస్తుంది, ఆలోచిస్తుంది.
ఇప్పటికైనా నన్ను
చూసి ఆహ్వానిస్తే
కలల కౌగిలి మధురిమతో
అనుభూతినిస్తాను!
కొన్నిసార్లు
మాటలకంటే కౌగిలే సమాధానమిస్తుంది..!
01st June,
2010.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు