"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Thursday, 11 August 2016

సొగసు

ఈ అరవిరిసిన మొగ్గను చూసి
కనులతో మిళితమైన అధరాల చప్పుడు విని
నీలిమేఘమైన మోమును వీక్షించి
గాన గంధర్వులు ఏమంటారో.!
సుమధుర కవులు ఏం రాస్తారో.!
తత్వవేత్తలు ఏం సమాధానమిస్తోరో..!!
తెరమరుగున తన భారము దాచుకోకుండా 
మెరుపులా మంత్ర వర్ష వైనాన్ని తిలకిస్తూ,
జరిగినదే జరగని కలలాగా,
తేలియాడే ఊహాలోకం నుంచి బయటపడి 
ఏమిటో అని చూస్తూ ఉండిపోతరేమో . . !
తన నల్లటి కురుల నట్టడవిలో మాయమైపోతారేమో . . ! 

చలనం లేని చలువరాయిలా ఉండిపోతే  
శ్రీ రాముని పాదాలు వారిని కూడా తాకగానే
నిజ జీవితంలోకి వస్తారనిపించే సొగసు
నా చెలి సొంతం.                             

14th February, 2010.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!