"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Saturday, 20 August 2016

రక్షా 'బంధ'నం

ఒకే చేతిలో రూపాన్ని సంతరించుకోబడి 
స్వర్గపు గర్భం నుండి బయటకొచ్చిన 
అనునిత్యపు రక్షక కవచమే పేగు బంధం.! 

ఇంతై ఇంతింతై ఇనుమంతవుతూ 
తోడున్నానంటూ ఆపన్న హస్తం అందించేదే రక్త బంధం.! 

ఈ బంధాల వాకిట్లో సంతోషాలు శివమై 
కష్టాల కడలిపై నాట్యమాడి అణగత్రోక్కి 
భరోసా ఇచ్చేదే ప్రేమ బంధం.! 

ఇప్పుడు మనిషి మార్చేసిన ఈ కాలంలో 
నిలబడక ఎగిరే రాకాసి చప్పుళ్ళ ధన బంధమయి 
చెదపురుగులు పట్టిన పుస్తకమయ్యింది.  
హరించుకుపొయిన ఈ పుస్తకంలో 
పేజీల వాటా తనకూ వేయమంటూ 
ఆ వాటాలాకే రక్షా 'బంధ'నాలు కట్టే వ్యక్తులు 
సోదర భావానికి ధనబంధం రుణబంధమని
మెలికలు పెడుతూ పేజీ చిరగకపోతే 
సునాయాసపు హత్యలు చేయించేవారు ఒకవైపైతే
కళాశాలల్లో యువతకు ఇది ఓ బ్రహ్మస్త్రమై 
తక్షణమే పుట్టుకొచ్చే కృత్రిమ బంధమై 
హేళనల నుండి బయట పడుతున్నామనుకునేవారు మరోవైపు... 

స్వార్ధం కొత్త రూపు సంతరించుకొని 
మమకారం మంట కలిసి పోతుందనుకుంటా !
జీవిత చక్రం తన మూలాలను చేరుకోలేదేమో !
బంధాలతో బంధీలవ్వడం బాధిస్తుందేమో !
ఎక్కడి నుండి ఎక్కడికి పయనిస్తున్నామో !

రండి ....!
స్పురణకొచ్చే  మాటల ప్రవాహాన్ని పెంచి 
గాలి మేడల బంధాల గోడల్ని కూల్చి 
వాటికి నిర్యాణాలను ఆర్పించి 
మరుగున పడిపోతున్న బంధాల పరిమళాలను 
నిర్మించి నిర్వచనాలనందించి 
ఎదుటివారిని ఓదార్చాక కలిగే సాంత్వననుభవిద్దాం !
చీకటిని చిదిమిన ఈ ఉదయం ఓ వరం !
తప్పులనే చీకటిని చిదిమేసి 
ఒప్పుగా నడుచుకునే సంధ్యా మార్గమే మన ఉదయం. 
గుర్తెరిగిన ఈ బంధుత్వాలన్నీ 
ఓడిపోలేని సత్యాలే కదా ...!                               

 02nd August, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!