నీ రూపం మరుపురానిది
నీ మోము వర్చస్సు కూడినది
నీ అల్లరి చేష్టలే
మధురానుభూతులు
నీ ప్రవర్తనకే అభినందనలు
నీ గుణమే నీకు వనమాలి
నీ హాస్యమే నీకు ఆభరణం
సౌరభాన్ని చూడలేనంతగా
నీ వక్తిత్వాన్ని వ్యక్తీకరించలేం
వెన్నలకు
రూపాన్నివ్వగలేనంతగా
నీ గుణాన్ని వక్రీకరించలేం
సూర్యుని కాంతి మారుతూంటుంది
నీ మంచి ప్రవర్తన
ఎల్లప్పుడూ ఒకటే!
వెన్నెల కాంతి హాయినిస్తుంది
నీ మాటలు ఆనందానుభుతినిస్తాయి.
శబ్ద వేగం కన్నా కాంతి వేగం ఎక్కువ
నీ జ్ఞాపకాలే ఇప్పుడేక్కువయ్యాయి
చిరునవ్వులను చిందించి
మనోఫలకంపై చిరునవ్వు గీత
గీశావ్
పాన్పు పైన రోజులను గడిపి
దూరమైన స్వర్గపు అంచులకోసం
మెట్లేక్కావ్
జ్ఞాపకాలను మాకు మిగిల్చి
పంచభూతాలలో మిళితమైపోయావ్
అప్పుడే తెలిసింది
జ్ఞాపకాలు అంటే ఏంటో అని
ఎంతదూరమో నీ ప్రేమని..!
07th September, 2009.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు