"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 15 June 2016

నిరీక్షణ

నిరీక్షణ –
దేని కోసమో నిరీక్షణ !
తపన –
ఏదో తపన !
తలంపు –
ఏమిటో తెలియని తలంపు !
సాధించాలి –
ఏమిటో అది !
అంతా ఆలోచనల పర్వం !
వీటి నుండి బయటపడేది ఎప్పుడు ?
ఇదీ తెలియని ప్రశ్నే ..!

ఎదగాలి –
పై ఎత్తుకు ఎదగాలి !
ఎంత దాక –
అదీ తెలియని ప్రశ్నే ..!
చిన్న మస్తిష్కంలో ఎన్నో దారులు,
సరైన మార్గం కోసం అన్వేషణ.
ఈ అన్వేషణతోనే సాగిపోతుంది జీవితం.

తెలుసుకోవాలి –
దేని గురించి !
మెదడంతా అనుమానపు ప్రశ్నల తోటైంది.
ఇదంతా
విఘాతపు ప్రశాంతతను కొనడం కోసమే.
సంపాదించాలి –
ఎంత వరకూ?
ఎదుటి వ్యక్తీ సహనం కోల్పోయే వరకా,
ప్రేమగా మెలిగే శక్తి పోయే వరకా,
ఉన్న గర్వం పెరిగే వరకా !
మనిషివేనా –
నువ్వసలు మనిషివేనా !
ముందసలు ఆ విషయం తెలుసుకో.
తెలుసుకోవడంతోనే సరిపెట్టకు.
ఆచరించు,
అనుభూతిని పొందు !

పొందాలి –
ఎంత వరకు ?
ఎదుటివారి మొహంపై చిరునవ్వు వెలిగే వరకు.
వెలిగిన కాంతి అందరికి చూపే వరకు.
చిరునవ్వు చిరునామా చిలికే వరకు.
ముక్తి కోసం ముక్తసరిగా ఉండేవరకు.

చెప్పాలి –
ఏమి చెప్పాలి ?
తెలియనిదే చెప్పాలి.
తెలుసుకొని చెప్పాలి.
చెప్పేదేదో తెలుసుకునేవరకు చెప్పాలి.
కలిసిన ఆధారాలు విప్పి
మాట్లాడేవరకు చెప్పాలి.
పరిగెత్తాలి –
ఎంత దూరం వరకు ?
పోయిందనుకున్న జీవితం పొందే వరకు.
ఆశల పర్వం చిగురించే వరకు.
అందుకోసం నిడురించకు మేలుకో,
స్వార్ధపూరితంగా ఉండకుండా
మంచి నడవడికను అలవర్చుకో.
ఆ నడవడికతో నాట్యం చేయించు.
అసభ్యంగా కాదు –
అహో అనిపించేలా !

ఇప్పుడిప్పుడే తెలుస్తుంది ..!
ప్రశాంతతకు స్వచ్చమైన దారి.
కమ్మని మధురమైన కావ్యమే దారి.
 ఆ దారిలోనే ప్రయాణిస్తా.
నా తపనతో తలంపుతో నిరీక్షణ ఫలించింది.
దీనితోనే తెలుసుకొని
సాధించి ఎదుగుతాను.
ప్రేమను సంపాదించే మార్గం పొంది మనిషైతాను.
తెలిసే వరకు –
మొహంపై చిరునవ్వు చిందించేలా చెప్తాను.
నిస్వార్ధ నడవడిక కోసం పరుగెత్తుతాను.
నేనూ మనిషినేనని నిరూపించుకుంటాను !!

09th August, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!