"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 4 May 2016

తెలుసుకో

ప్రతి నరుడూ ఆరాటం చెందుతూ -
ఆరాటం నుండి ఆలోచనను కనుగొని
ఆకాశానికి నిచ్చెన వేయాలని చూస్తూ ,
ఆచరణ సాధ్యం కాని పనుల గూర్చి ఆలోచిస్తూ ,
విలువైన సమయానికున్న పునాదులను పెకిలిస్తున్నాడు.

ఆ ఆరాటానికి తోడ్పడే ఆటంకాన్ని అదుపుచేయాలంటే
గగనం ఎంత ఉరిమినా
గిరికి చలనం లేనంత ధైర్యంతో ,
గంగ పొంగి పొరలినా
నేల భీతి చెందనత ఓర్పుతో ,
తనువుయందు పట్టుదల, ధైర్యముతో
చేయవలసిన కార్యాన్ని సాకారంగా
ఆకారంగా, అవసరముగా భావించాలి.

ఎందుకంటే
కోరిక మాత్రమే చేయలేనిది
ఒక్క అవసరం మాత్రమే చేయగలిగినది
ఈ ధరణియందు తరుణీ వరమివ్వాలని చేసే
అమృత ఫలసాధన కోసమే పోరాటము.
అప్పుడే పోరాటంతో పరుగులెత్తి
అమృత ఫలసాదనను పొందుతాం.
తెలుసుకొని మసలుకో నరుడా !!                                     

02nd December, 2009.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!