ప్రకృతి పరవశాన్ని
చూస్తూ ఉంటే,
నెమలి అద్భుత
నాట్యమును గమనిస్తుంటే,
జలపాతం నుండి
జాలువారే
సుందర ప్రవాహాన్ని
వీక్షిస్తుంటే
మనస్సు
ఉప్పొంగుతుంది.
సునామి భీభత్సం
గురించి తెలుసుకున్నా.
నీ మనస్సులో ఏముందో
తెలుసుకోలేకపోతున్నా.
మనసు మాట వినదు
అంటే ఏమో అనుకున్నా.
నిను
కలసినప్పట్నుంచి వినదని తెలుసుకున్నా.
మనసు బరువు ఎక్కువవుతుందంటే
ఆశర్యపోయా
నిను
చూసినప్పుడల్లా ఎంత ఎక్కువవుతుందో తెలుసుకోలేకపోయా.
నిను కలుస్తున్నననే
భావనతో
మనసు ఏ లోకంలో విహరిస్తుందో తెలుసుకోలేకపోయా.
కానీ
రోజా ముళ్ళ వలె
పరిస్తితులు మనసును గుచ్చుకున్తున్నాయ్.
అటువంటి భారమైన
మనసును ఉడికించక దరిచేరవే చెలీ !!!
20th December, 2008.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు