"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 4 May 2016

చింతన

కొత్త సంవత్సరం వస్తుందని అందరూ సంబరపడుతుంటే 
నేను మాత్రం
సంవత్సరం వెళ్ళిపోతుందని చింతిస్తున్నా.
ఎందుకంటే
నగరీకరణ మొత్తం మాంద్యం కోరల్లో చిక్కుకొంటే 
నేను మాత్రం
నా చెలి దరహాస అందెల్లో చిక్కుకున్నాను.

ఎలాగంటే
మేఘం ఉరుముతుంటే
నా మనసు మెరుస్తుంది.
ఆ మెరుపు కాంతుల్లో
చెలి కోసం పరిగెడుతుంటే
ఉరిమిన మేఘం వర్ష ధారమై
గమనానికి అడ్డుపడుతున్నా
ప్రవాహానికి ఎదురెళ్ళే మీనం లాగా వెళుతున్నా.

ఈ ప్రయత్నాన్ని మెచ్చిన వాయుదేవుడు
పుష్పాలను తివాచిలా పరచి ప్రోత్సహిస్తుంటే
అగ్నికివాయువు తోడైనట్లు
కాంతి వేగంతో చెలిదగ్గరకు వెళితే తెలిసింది
తను మేడిపండు లాంటిదేనని.
అందుకే
తన దరహాస అందెల కోరల్లోంచి
బయటపడలేక చింతిస్తున్నా
ఎన్ని సంవత్సరాలు గడిస్తే గతించికుపోతుందో
తెలీక చింతిస్తున్నా
అయితే వేచి చూడాలంటారా !!                               

26th January, 2010.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!