"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 30 March 2016

ఇతను కనిపించడం లేదు

అవును ఇతను కనిపించడం లేదు!
చాలా చోట్ల వెతికాను 
చాలా మందితో వాదించాను కూడా!
ఆనవాళ్ళు పట్టుకొని తిరిగాను 
పరిహాసింప బడ్డానే తప్ప 
అతనెక్కడికెళ్ళాడో తెలుసుకో లేకపోయాను. 
మీకెప్పుడైనా కనిపిస్తే చెప్పండి!
అతన్ని చూసి నవ్వుకోవద్దు!
అతని గురించి హేళనగా మాట్లాడొద్దు!
మీరెప్పుడైనా వింటే నా చెవిన పడెయ్యండి!
అతని ఆనవాళ్ళు చెప్పలేదు కదా...

   "నాగరికతల కన్నా ముందే పుట్టాడు 
    సంస్కృతులను ఉద్భావింప జేశాడు 
    ద్వీపకల్పమై ప్రత్యేకతను చాటుకున్నాడు 
    వజ్రాలను తనలో దాచుకున్నాడు 
    తారతమ్యాలు లేకుండా భిన్న తామరలన్నింటిని 
    తనలో కలిపేసుకుంటూ, ఆహ్వానిస్తూ 
    భిన్నత్వంలో ఏకత్వంకు నిలువెత్తు నిదర్శనమై 
    ఆకలన్నప్పుడల్లా ఆదుకుంటూనే ఉన్నాడు 
    మమ్మల్ని గర్వించేలా తయారు చేశాడు 
    పోరాటమెలాగో కొన్ని సంవత్సరాల పాటు 
    తను పోరాడుతూ మాకూ నేర్పించాడు 
    ప్రమాణ పూర్తిగా గొప్పవాడైనాక 
    అందరి నోళ్ళలో నానుతున్నాడు. 


  
  అవినీతి చేపలను పెంచుకుంటూ 
    కుంభకోణాల ఊభిలో చిక్కిపోయి 
    ఏకత్వానికి భిన్నత్వమని నిర్వచిస్తూ 
    కుల మత విభజనలకు నడుం కడుతూ 
    పిచ్చివాడిలా ఎగిరెగిరి పడుతున్నాడు. 
    పాల పొంగు క్షణికమే అనుకుంటే 
    విశ్రమించని కడలి కెరటాల్లా 
    పడుతూ లేస్తూ మళ్ళీ పడిపోతున్నాడు 
    మాకు దారి చూపించాల్సింది పోయి 
    తనే దారి తప్పి పోయాడు." 

ఈ ఆనవాళ్ళన్నీ కనిపించగానే 
భారతదేశ పటంలో గమనించాననొద్దు!
భారతదేశం గురించి వివరించవద్దు!
ఎందుకంటే 
అలా తప్పిపోయినందుకు తట్టుకోలేక పోతున్నాను.  
కనీసం రాబోయే తరమైనా 
కొత్తగా నిర్వచించి బాధను తీర్చండి. 
అతనేక్కడున్నాడో వెతికి పట్టుకొని 
పడిపోయిన పటాన్ని నిలబెట్టండి. . !! 

26th December, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!