"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 30 March 2016

కొత్త రకం మనిషి కావాలి

కాలాన్ని విభజనలుగా మార్చారు.  
తృప్తిని విజయంతో సరిపెట్టారు. 
పట్టుదలను స్థాయిలుగా నిర్దేశించారు.  
కాంక్షలను అపరిమితం చేశారు.  
మనుషుల మధ్య బంధాల్ని పరిమితం చేస్తున్నారు.  
లౌకిక రాజ్యంలో లౌఖ్యం ప్రదర్శిస్తున్నారు .  
ప్రజాస్వామ్యంలో పరిపాలకులుండడం లేదు.  
ప్రజారాజ్యంలో కల్లోలాలు తగ్గడం లేదు. 

పెరుగుతున్నది పేదరికపు చప్పుళ్ళే కాదు
చెలరేగుతున్నది ఉగ్రవాదమే కాదు
మనలో ఘనీభవిస్తున్న మమతలు -
మనలో ఆవిరవుతున్న ఆలోచనలు -
మనలో దారి మళ్ళుతున్న ఆవేశాలు.  
ఆవేశం విలువ కట్టలేనిది.  
సక్రమార్గమే దేనికైనా విలువనిచ్చేది.  
తియ్యనైన మాటలను ఒలికిస్తే సరిపోతుందా 
విలువని సంపాదించుకోవాలికాని !
ఇవన్ని జరగాలంటే


మనిషిలో భావోద్వేగాలు సమసిపోవాలి!
సమాజంలో అసమానతలు కనుమరుగావ్వాలి!
పరిపాలన మన చేతుల్లోనే ఉండాలి.  
మనిషి మారి 
మరో కొత్త రకం మనిషి పుట్టాలి.

13th April, 2013.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!