"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 30 March 2016

భయం నుండి భయటపడు

చీకటెప్పుడూ భయపడుతుంది 
వెలుగెక్కడొచ్చి తనని మాయం చేస్తుందోనని !
ఓటమేప్పుడూ కంగారు పడిపోతుంది 
గెలుపెక్కడొచ్చి తనని ఓడిస్తుందోనని !
వెన్నేలెప్పుడూ జాబిల్లిని వదిలేళ్ళడానికి ఒప్పుకోదు 
దూరమైతే ఎక్కడ విడిపోవాల్సి వస్తుందేమోనని !
గాలులేప్పుడూ చెట్లను ఖండించడానికి ఇష్టపడవు 
ఖండిస్తే తమ ఉనికెక్కడ పోతుందేమోనని !
రెక్కలున్నాయని పక్షులెప్పుడూ ఎగురుతూనే ఉండవు 
అలా చేస్తే వాటి బ్రతుకే ఉండదని !కాబట్టి ఓ జీవా !!
ఉత్తములకెప్పుడూ జీవితం అనుభవమే 
ఆలొచనలున్నాయని దాన్ని దూరం చేసుకోరు !
పోరాటానికి సిద్ధమని తెలియజేయడానికి 
ఆవేశమొచ్చి నిలబడతాయి రోమాలు
నువ్వు నీ భయాల నుండి బయటపడి 
జీవిత మనుగడ పోరాటానికి సిద్ధమై 
ఉత్తముడిగా ఆవిర్భావించాలని కోరుకుంటున్నాను.

 12th June, 2013.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!