"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Wednesday, 30 March 2016

అతను పోరాడి శిఖరమైనాడు

అతనో శిఖరమైనాడు. 
చాలా మంది అందుకో గలిగేదే. 
కానీ ఇప్పట్లో ఎవ్వరూ అందుకోలేనిది. 
సకల విషయాలకు సామీప్యాన్ని ప్రసాదించిన 
సకల జనుల హితం కోరినా 
అచేతనంగా అందుకోవడానికి ఇష్టపడని 
వెల్లు'విరిచేసిన' నాగరికత కల నా దేశంలో 
అతను అందుకున్నాడు ..!

ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తుగా ఎదిగాడు. 
కొన్నాళ్ళ ముందు అతనూ అందరి లాంటివాడే. 
అలాగని అనాగారికతను ప్రదర్శించలేదు. 
అమాయకంగా చూస్తూ నిలబడిపోలేదు. 
ఆదర్శానికి నిర్వచనం తెలుసుకున్నాడు. 
ఆదర్శానికి నిలువెత్తు నిదర్శనమైనాడు. 

ఆదర్శం అంటే చూసి పొంగిపోవడం కాదు. 
ఆదర్శం అంటే ఢoకా  బాయించడం కాదు.   
ఆదర్శం అంటే  ఆచరిస్తున్నా మనుకుంటూ 
తమల్ని తామే నిరాకారంగా ఆర్పేసుకోవడం కాదు. 
ఆదర్శం అంటే తల్లి బిడ్డకు లాల పోసేటప్పుడు 
నియమ నిష్టలతో సాగించే కార్యం లాంటిది. 
ఆదర్శం అంటే కళ్ళు తెరవగానే స్తంభించిపోయే 
స్వప్నాన్ని కళ్ళముందు నిలపగలిగే సూత్రం లాంటిది. 
ఆదర్శం అంటే వ్యక్తి నుండి వ్యక్తికి,
సంస్థ నుండి సంస్థకు తద్వార సమాజంకు 
సంకోచించకుండా సంక్రమణం చెందుతూ 
సర్వోన్నతంగా మారడానికి వెలుగిచ్చే శక్తి లాంటిది. 
ఆ శక్తి యుక్తులనే జవసత్వం నిండా నింపుకొని 
విలయ తాండవం చేస్తున్న సాకేతిక యజ్ఞంలో 
ఇంకా నాశనం కాకుండా వికృతంగా పగబట్టి 
అణువణువునా ఉన్న శరీర కాంతిపుంజంలోకి జొరబడి 
ఆ శక్తినే ఆపి క్రూరంగా కుచించుకు పోవడానికి కారణమై 
అతన్నుండి ప్రజ్వల్లిస్తున్న క్యాన్సర్ పై 
జయించడానికి అతను ఒక వసంతమే పోరాడాడు. 
పోరాటాన్నే ఒక ఆయుధంగా మలచుకున్నాడు. 


క్రీడా ప్రాంగణంలో సహచర ఆటగాళ్ళ మధ్య 
తిరుగాడిన ఆ యౌవనపు రోజులు మెదిలినప్పుడల్లా 
ముదుసలి యౌవనాన్ని కోరుకున్నంత బలంగా
సాధించాల్సింది మిగిలిందని బాధపడే 
ఓ ఆశావాది ఆశించే మునుపటి కాలంలా
వాటికి పరితపించే అతను పోరాడాడు. 

పోరాటం ఒక్క క్యాన్సర్ పైనే కాదు
తనలో రగిలే అసమానత్వపు జ్వాలలపై
తన నుండి విస్పోటనం చెందే అశుద్ధ మానవత్వంపై
తనలో సుప్తావస్తలోనున్న క్రమ శిక్షణా రాహిత్యంపై
ధనముపై తాను పెంచుకున్న మమకారంపై
ఘడియ విఘడియల  మధ్య నలిగి నలిగి 
నిత్యం పోరాడి పోరాడి పోరు ముగించాడు. 
పోరులో పై చేయి సాధించాడు. 
అందుకే అతను శిఖరమైనాడు. 

ఇప్పుడా శిఖరం ప్రాంగణంలోకి చొరబడింది. 
ఎంత మహోన్నతంగా, ఎంత ఉగ్ర రూపంగా
అతను పోరాటంలో సాధించిన సంపదను 
ఉపయోగించ గలుగుతాడోనని సర్వత్రా ఆసక్తి. 
అందుకే మన క్రికెటర్ యువరాజ్ సింగ్ కు 
ఆహ్వానం పలుకుతూ శుభాకాంక్షలు తెలుపుదాం ...!

01st October, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!