అది
నువ్వు తిరుగాడే సమయంలో
నీ వెనుకే వస్తూ
ఊరిస్తుంటుంది.
దానిని
తలచుకొని అందుకునే వరకూ
ససేమిరా నిన్ను వదిలి
పెట్టదు.
నువ్వు దాని సాయంతో విజయం
సాధిస్తే
నువ్వు ఇంకొకరిని
బంధించేసినట్లే !
నీ ఆలోచనల్లోకి విలీనం
చేయాలని ప్రయత్నించినట్లే !
అయినా
తన ప్రాముఖ్యాన్ని
నిలబెట్టుకోవడం కోసం
నిన్ను కూడా
బంధించేస్తుంది.
కొత్త వసంతానికి నాంది
పలుకుతుంది.
ఈ కొత్త వసంతంలో కొత్తవి
వికసిస్తాయి.
ఆహ్లాదకరమైన హరితాలతో వనమై
పరిఢవిల్లుతుంది.
వాటన్నింటి పైన పుష్పించే
పుష్పమై
సువిశాల సుగంధాలు
వీస్తుంటాయి.
ఈ పుష్పాలు ఓ పరుపై
పరచుకుంటాయి.
తియ్యనైన అనుభూతిని
కలుగజేస్తూ
ఇంకో నలుగురిని బంధించేస్తుంది.
అయినా గాని
తన పట్టుదలను మాత్రం
వదులుకోదు.
మొదట్నుంచి మళ్ళీ
పరిగెడుతుంది.
06th December, 2012.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు