"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 15 February 2016

కొత్త సంవత్సరం – 2012

అడుగులోన అడుగు మారునా తుద వరకు !
కలసి సాగే ఈ ప్రయాణం తెలియునా !
గమ్యాలు మారేను కదిలే ప్రతి గమనంలో !
చేరుకోగాలమా ప్రతి బాటలోనూ ?
కలగలిపిన ఈ కోరికలు కళ్ళలోన ప్రతిభింబాలై
అరమరికలు లేని  కాలంలో 
దాపరికాల దాగుడు మూతలుగా
చిక్కుకున్నట్లే అనిపించే జీవన విధానం
పట్టింపుల బందీఖానాలోకి వెళ్లునా?
కాదవి తెలియాడెను ఆశావాహ దృక్పద లోకంలో.!జరుగుతున్న క్లిష్ట పరిస్థితులు 
జరిగిపోయిన కదలికలను గుర్తు చేస్తూ
జరగాల్సిన దాని కొరకు సవరణ అంటుంటే -
మొదలుపెట్టాయి బతుకుబండి నడవడం కోసం.

గతి చక్రాల జీవిత గమనపు తలుపులు
తెరుచుకొనే వేళ కొరకు
ఎదురు చూసే ఈ నయనాలు
ఓపికలేక బరువై విశ్రాంతి అంటున్నాయి.
కుదురులేని కప్పిన దుప్పటి ఎగసెగసి పడుతుంది.
రేపటికి స్వాగతమంటూ ఉత్సాహంతో 
చెప్పమంటున్నాయి కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

01st January, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!