"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Tuesday, 16 February 2016

నేనిప్పుడు

నా గురించి ఆలోచించడం మొదలెట్టాను,
నాలో నేనుగా నేను లేను.
ఇంకేదో ఎవరో నాలో ప్రవేశించారు.
నా అలవాట్లు కట్టుబాట్లు అన్నింటిని మార్చేశారు.

యధాస్థానానికి తీసుకురావడానికి నీను ప్రయత్నించినా  
అలవాటు పడిపోయిన మనస్సు ఒప్పుకోనంటుంది.
నన్ను నన్నులా మార్చుకునే శక్తి నశిస్తుంది.
ఆలోచనలన్నీ నా ఆధీనం తప్పాయి.
తనకోసమే మరో దారిని వెతుక్కున్నాయి.
వెనుదిరగక ఆ దారిలోనే ప్రయాణించాయి.
తప్పొప్పులను ఆలోచించనంటున్నాయి.స్వల్ప వ్వవధి సాగాత్యమే ఎక్కువంటూ 
నన్ను కూడా నిర్లక్ష్యం చేశాయి.
మబ్బు తెరల మసక అడ్డు 
నిలబడ్డ గాలి మేడలు 
ఒక్కసారిగా హృదయ పాతాళంలోకి కుప్పకూలాయి.
దిగివచ్చిన ఆలోచనలు మూలాలను వెతుక్కున్నాయి.
సిగ్గుపడిన మనస్సు ప్రాయశ్చిత్తంకై 
మూలాల దారులను శుభ్రపరిచి 
మలినమైన హృదయ కుహర తలుపులను తెరిచి 
ఆశల శ్వాసతో వాటిని బంధీ చేసి 
నాలో దాగున్న అజాత శత్రువును వెలుపలకు లాగి 
నన్ను నన్నుగా ప్రతిబింబించేలాగా చేసి 
అన్నీ నా స్వాధీనంలోకి వచ్చి చేరాయి.

జూలు విదిల్చిన నా విజ్ఞానపు కౌటిల్యం 
తల్లి దండ్రులకు అండగా ఉండడంపై దృష్టి సారించింది.
మెల్లగా నా గతం కనుమరుగావుతున్నది . . !

30th May, 2012.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!