"భావోద్వేగాలతో సావాసం చేసేవాడే కవౌతాడు. కమ్మేసిన నిశ్శబ్దమే అతని కవిత్వమవుతుంది"
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
*31.05.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 23.02.2020 న సాక్షి ఆదివారం అనుబంధం ఫన్-డేలో ప్రచురితమయిన పిల్లల కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!

Content

Monday, 11 January 2016

స్త్రీ

అర్ధం చేసుకోగలిగే శక్తి మనకు లేనప్పుడు 
వారికనుగుణంగా మనం మారడమో 
మనకనుగుణంగా వారిని మార్చడమో చేయాలి. 
అది చేయకుండా అరుస్తుంది
మనల్ని అరిచేలా చేస్తుంది. 
స్త్రీ ఉన్న చోట గొడవకు చాలా చోటుంటుంది. 
అది స్త్రీ తోనున్న గొడవ!

గొడవలు జరిగినప్పుడు 
మౌనం మంచిదవుతుంది. 
తప్పులు పునరావృతమవుతున్నప్పుడు 
మౌనం వినాశాకరమవుతుంది. 
తెలియనిది తెలుసుకోదు
తెలిసినది వదిలిపెట్టదు
కాని అనుమానాన్ని చేధిస్తుంది
గొడవల గోల పక్కన పెట్టి 
అనుమానాన్ని చేధించి దారిన పెడుతుంది. 
అదే స్త్రీ లోనున్న అనుమానం!

రెక్కలను విప్పుకొని విహరిస్తున్న పక్షిని చూసి 
అంతకన్నా ఎత్తుకు ఎగారాలంటుంది. 
వినీలాకాశంలో విహరించాలంటుంది. 
కోరికల పుట్టకు ప్రతిరూపమే స్త్రీ
అసలు తృప్తి పడడమే తెలియదు. 
అవి  స్త్రీ లోదాగున్న ఆశలు! 

తనకో తోడు దొరికాక 
మనల్ని సంతోష పెట్టకపోయినా 
తను మాత్రం సంతోష పడుతుంది. 
ఆనందం ఓ వర్ణమైతే ఎలా ఉంటుందో చూపిస్తుంది. 
సంతోషాలకు కేరాఫ్ అడ్రస్ స్త్రీ.
అది పసిగట్టగలిగితే సంతోష పడగలం. 
అది స్త్రీ అందించే ఆనందం!

స్త్రీ అంటే నిప్పు
ముట్టుకుంటే కాలుతుంది
నీళ్ళు పోస్తే చల్లబడుతుంది
జీవితాన్నీ అందిస్తుంది.
ఆ నీళ్ళే ప్రేమ. 
మనస్సుకు నచ్చిన ప్రేమ 
ప్రేమించిన మనస్సుకు తన ప్రేమను ధారపోస్తుంది
జీవితం నీకే అంకితమంటుంది.
అది స్త్రీ గొప్పదనం!

స్త్రీ అంటే జాగ్రత్త 
తను జాగ్రత్తగా ఉంటుంది.
కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటుంది
అందుకే స్త్రీతో జాగ్రత్తగా ఉందాం!
ప్రేమగా చూసుకుందాం!!

                                     26th June, 2015.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు

 
విచ్చేసినందుకు ధన్యవాదములు..!!