పచ్చని మామిడి
తోరణాల నడుమ
పురోహితుని, పెద్దల
సమక్షం దీవెనలతో
ఆశీనుల హర్షద్వానాల
మధ్య
జరిగే అంగరంగ
వైభవమే కాదు – పరిణయమంటే !
రెండు = ఒకటిగా
మారి మరో అనుభందానికి
ప్రతీకగా నిలిచే
మనసుల సంయోగమే - పరిణయం.
భాగస్వామికి జీవితాంతం
ప్రేమను పంచాలనే తెలిపే ఆజ్ఞ - పరిణయం.
సహచరులకు టంచన్ గా
ఆత్మీయతను ఇచ్చే అనువైన సమయం - పరిణయం.
సుఖ దు:ఖాల సమిష్టి
ప్రయాణమే - పరిణయం.
ఎదనందు నింపుకునే
అనుభూతుల పర్వానికి సాగనంపే - పరిణయం.
సాగరాన్ని ఐన ఈదగలం
కానీ సంసారాన్ని
ఈదాలెం అని అపవాదును
కలిగిన ఈ పరిణయమే
సృష్టి ఉత్పాన్నానికి కారణమవడం - ఆశ్చర్యం.
14th April,
2009.
0 comments:
Post a Comment
మీ అమూల్యమైన సలహాలు సూచనలను ఇక్కడ పెట్టండి - తెలుగు కవితలు